భారతీయ పురుషులను అందగాళ్లుగా చెబుతున్నాయి సర్వేలు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలే అందుకు ఉదాహరణలుగా తేల్చక తప్పడం లేదు. ఈ సర్వేలు నిజం చేసేలా భారతీయ పురుష పుంగవులపై విదేశీ వనితలు మనస్సు పారేసుకుంటున్నారు
ఈ మధ్య కాలంలో వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ప్రపంచంలో అందమైన పురుషుల జాబితాలో భారత్ రెండవ స్థానంలో ఉందని. అటువంటి అందగాళ్లతో వారి భార్యలు లేదా అమ్మాయిలు ఇంటిపని, వంటపని, ఇతర పనులు చేయిస్తున్నారని ఫన్ వీడియో ఒకటి వచ్చింది. అదీ నిజంగా ఫన్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సర్వేలు నిజంగానే భారతీయ పురుషులను అందగాళ్లుగా చెబుతున్నాయి మరీ. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఔననక తప్పడం లేదు. ఈ సర్వేలు నిజం చేసేలా భారతీయ పురుష పుంగవులపై విదేశీ వనితలు మనస్సు పారేసుకుంటున్నారు. వారి కోసం ఖండాంతరాలు దాటి, ప్రాంతం కానీ ప్రాంతానికి వచ్చి.. మత మార్పిడీలు చేసుకుని మరి వివాహాలకు సిద్ధమౌతున్నారు.
ఇటీవల కాలంలో ఫలానా అబ్బాయి.. విదేశీ యువతిని పెళ్లి చేసుకున్నాడట అన్న వార్తలు బాగా వినిపించాయి. పరాయి దేశానికి చెందిన యువతుల్ని, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న భారతీయ అబ్బాయిల గురించి చాలా కథనాలు చూశాం. ఇక్కడకు వచ్చి మన కట్టు, బొట్టును ఆకళింపుచేసుకుని, అచ్చమైన భారతనారీలుగా మారిపోతున్నారు విదేశీ మహిళలు. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న సమయంలో అందగాళ్లకు విదేశీ వనితలు పడిపోతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. వీటికి వేదికలు నిలుస్తున్నాయి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వంటి యాప్స్. సోషల్ మీడియా వచ్చాక.. దేశాల మధ్య హద్దులు చెరిపేస్తున్నారు యువతీ యువకులు. వాటి ద్వారా పరిచయాలు పెంచుకుని, ఫోన్ నంబర్లు మార్పిడి చెంది.., స్నేహం.. ప్రేమగా మారి.. ఆ తర్వాత ప్రేమికుడి కోసం భారత్ దేశానికి వచ్చేస్తున్నారు. భారత్‌లో ఉంటున్న ప్రియుడి కోసం కుటుంబ సభ్యులను వదిలేసి..స్వదేశానికి స్వస్థి చెప్పి, కట్టుబట్టలతో వచ్చేస్తున్నారు.
విదేశీ యువతులే కాదు మహిళలు కూడా ఇక్కడ మగవాళ్ల అందానికి, మాటకారితనానికి పడిపోతున్నారు. పబ్జీ గేమ్ ద్వారా పాకిస్తాన్ మహిళ సీమాతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడికి పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. చివరకు అతడి కోసం భర్తను వదిలేసి, నలుగురి పిల్లలతో అక్రమంగా యుపికి వచ్చి అతడ్ని పెళ్లి చేసుకుంది. నిన్నటి నిన్న బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ అనే మహిళ సైతం ఫేస్ బుక్‌లో పరిచయమైన ప్రియుడి కోసం తన 11 ఏళ్ల కుమార్తతో వచ్చి, మత మార్పిడి చేసుకుని మనువాడింది. ఆ తర్వాత అతడ్ని బంగ్లాదేశ్ తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తోంది. అది మరో వేరే విషయం అనుకోండి. ఇప్పుడు పోలండ్ వనిత కూడా జార్ఖండ్ యువకుడి కోసం వచ్చేసింది. ఇన్ స్టాలో పరిచమైన వ్యక్తి కోసం 45 పోలాక్ బార్బరా.. తన ఆరేళ్ల కుమార్తెతో పెట్టా బేడా సర్దుకుని వచ్చేస్తుంది. అసలు ఇలా విదేశీ ఆంటీలు.. భారతీయ పురుషుల కోసం ప్రాంతాలను దాటి రావడం వెనుక అందమా, లేక ఆకట్టుకునే వ్యక్తిత్వమా, మాటకారి తనమా అనేది ఇక వారి మనస్సుకే తెలియాలి. లేదా ప్రేమ గుడ్డిదేమో అన్న సామెతను మనం నమ్మాల్సిందే.