నీ సాయం తీర’నిధీ’…నీ హృదయం మెత్త’నిధీ’!..

క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ వ‌ల‌న పేద‌ప్ర‌జ‌లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం నాటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ప్రతి రోజూ సేవలను విస్తరిస్తూ వస్తోన్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరుగుతూ వస్తున్నారు. హాస్పిటల్ బెడ్స్ కావాలని, ఆక్సిజన్ సప్లై కావాలని, మెడిసిన్స్ కావాలని ఫోన్లు, మెసేజ్ ల ద్వారా అడుగుతూనే ఉన్నారు. వారి బాధ‌ల‌ను గుర్తించిన సోనూసూద్ అడ‌గ‌క‌ముందే సాయాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్ర‌మంలో ఇండియన్ రియల్ సూపర్ హీరోగా నిలిచాడు. దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో మ‌హ‌త్త‌ర సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చాడు. దేశ వ్యాప్తంగా తన సాయాన్ని అందించిన హెల్పింగ్ స్టార్ సోనూసూద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తున్నాడు.

Sonu Sood 759 3

ఇన్నాళ్ళు ఈ గ్రామాల‌కు న‌గ‌రం నుంచి ఫ్రిజ‌ర్ బాక్స్‌ల‌నురావ‌డానికి ఇబ్బందులు ప‌డ్డారు. దీని వ‌ల్ల శవాలు కుళ్ళిపోయి అయిన వారికి చివ‌రి చూపుకు దూర‌మ‌య్యేవారు. దాంతో గ్రామ స‌ర్పంచ్‌లు సోనూసూద్‌ను కోర‌డంతో త్వ‌ర‌గా బాక్సుల‌ను అందుబాటులో వుంచుతామ‌ని స‌ర్పంచ్‌ల‌కు సోనూ హామి ఇచ్చాడు. ఇందులో సానికిరెడ్డి పల్లి ఆషాపూర్ బోంకూర్ ఓర్వకల్ మడ్డికేరా, ఇంకా చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాడు. త్వరలోనే ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చాడు.