భార్య ఒడిలో పసి బిడ్డ.. స్కూటిపై వేగంతో వెళ్లి రెండు బస్సు మధ్యలో ఇరుక్కుపోయాడు

Bus overtake Viral Video - Suman TV

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. రోడ్డుపై బైక్ తో వెళ్లారా.. ఇక అంతే అతి వేగంతో వెళ్లి ఏరి కోరి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రోజుకి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వేగంతో వెళ్లకూడదని ప్రమాదాలకు గురి కావొద్దని ట్రాఫిక్ పోలీసులు అనేక సూచనలు చేస్తున్నా అవన్ని పెడ చెవిన పెట్టి మరి రోడ్డుపై దూసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కాలం యువత రైడింగ్ అంటూ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తూ నిండు జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

Bus overtake Viral Video - Suman TVఅయితే తాజాగా అక్టోబర్ 23న పుదుచ్చేరిలో జరిగిన దారుణమైన రోడ్డు ప్రమాద ఘటనలో భార్యభర్తలతో పాటు ఓ పసి బిడ్డ తృటిలో తప్పిన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక విషయం ఏంటంటే.. భార్యాభర్తలు పసి బిడ్డతో స్కూటిపై వెళ్తున్నారు. అలా రోడ్డుపై వెళ్తున్న క్రమంలో బస్సును ఓవర్ టెక్ చేయబోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న బస్సుకి ఢీ కుని రెండు బస్సుల మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే ఇద్దరు బస్ డ్రైవర్ చాకచక్యంగా సడన్ గా బ్రేక్ వేయటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో భార్యభర్తలతో పాటు పసిబిడ్డ కూడా సురక్షితంగా బయట పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.

https://www.facebook.com/BBCnewsTelugu/videos/%E0%B0%AA%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%88%E0%B0%95%E0%B1%81%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B1%87%E0%B0%97%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81/247569997386572/