అభిమాని అత్యుత్సాహం.. మాజీ ఫోర్న్ స్టార్ సీరియస్.. వీడియో వైరల్!

ఈ మద్య టాటూ అనేది చాలా కామన్ అయ్యింది. సెలబ్రెటీలు మాత్రమే కాదు.. సామాన్యులు సైతం తమకు ఇష్టమైన టాటూ వేయించుకుంటున్నారు. తాజాగా ఓ అభిమాని ఫోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా ఫేస్ ఫొటోను త‌న కాలుపై టాటూలా వేసుకున్నాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. దాంతో ఆ ఫోర్న్ స్టార్ అభిమానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక లెబానాన్‌కు చెందిన మాజీ పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా అప్పట్లో ప్రతిసారి సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీతో హల్ చల్ చేస్తుండేది.

miya kalifa minఈమెకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. గత కొంత కాలంగా ఈమె సైలెంట్ గా ఉంది.. ఫోర్న్ మూవీస్ కి గుడ్ బాయ్ చెప్పింది. తాజాగా భార‌త్‌కు చెందిన ఓ అభిమాని చేసిన ప‌ని కార‌ణంగా ఆమె పేరు ఇప్పుడు మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. ఢిల్లీకి చెందిన ఓ టాట్టూ ఆర్టిస్టుకు పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా ఎంతో అభిమానం. అందుకే ఆ శృంగార తారప‌ట్ల త‌న‌కు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆమె ఫేస్ టాటూ వేయించుకోవాలని భావించాడు. ఆమె ఫేస్ ఫొటోను త‌న కాలుపై టాటూలా వేసుకున్నాడు. ఆపై ఆ దృశ్యాల‌ను వీడియో తీసి కొన్ని వారాల క్రితం సోష‌ల్ మీడియాలో పోస్ట్‌చేశాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘tattoo_artist_01’ లో ఆ వీడియోను అప్‌లోడ్ చేశాడు.

ఇప్పుడు అది కాస్త బాగా వైరల్ అయ్యింది.. దాంతో మియా ఖ‌లీఫా అసంతృప్తి వ్య‌క్తంచేసింది. అభిమానం ఉంటే ఇలా చాటుకోవాలా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. టాటూ ఆర్టిస్ పోస్ట్ చేసిన వీడియో క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ.. “ప్లీజ్ సే సైక్… దిస్ ఈజ్‌… టెరిబుల్,” అంటూ క్యాప్ష‌న్ రాసింది. ఆ పోస్టుకు తాగిన మ‌త్తులో ఉన్న ఎమోజీని కూడా యాడ్ చేసింది. అయితే దీనికి ఆ అభిమాని ఏమాత్రం బాధపడలేదు.. పైగా త‌న పోస్టుకు ఆమె రెస్పాండ్ అయినందుకు సంతోషం వ్య‌క్తం చేస్తూ.. మియా ఖ‌లీఫా త‌న వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ రిప్లై ఇచ్చినందుకు ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి అంటూ ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. ఆ వీడియో 40 ల‌క్ష‌ల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు.