సాధారణంగా సెలెబ్రిటీలు అనిపించుకున్నాక వారి హోదా, ప్రవర్తన, సౌందర్యం ఇలా అన్ని విషయాల్లోనూ గొప్పగా ఉండాలని ఆశిస్తుంటారు. కొందరు ఇవన్నీ ఉన్నప్పటికీ, ఒదిగి ఉంటూ ఫ్యాన్స్ మనసు గెలుస్తుంటారు. అయితే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలైతే వారి కార్లు, బంగ్లాలు, ఆస్తులు ఉన్నాయని చూపించడం మామూలే. కానీ.. సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ శృంగారతార ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకొని.. దాదాపు రూ. 31 కోట్లు విలువైన కార్లను కలిగి ఉందంటే.. అది మామూలు విషయం కాదనే చెప్పాలి.
మరి ఎవరా స్టార్.. ఇదివరకు ఏం చేసేది? అన్ని కార్లు ఎలా కొనగలిగింది? అంటే.. ఆమె బ్యూటీ పేరు మియా ఖలీఫా. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మియా పేరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ టైమ్ మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఆ తర్వాత పో* స్టార్ గా వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. అలాగే అన్ని దేశాలతో ఇండియాలో కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సన్నీ లియోన్ తర్వాత ఇండియాలో అంతటి క్రేజ్ కలిగిన బ్యూటీ మియా ఖలీఫానే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ప్రతి ఏడాది మియా బర్త్ డేని కొన్ని ఏరియాలలో సెలబ్రేట్ చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఇక 29ఏళ్ళ మియా ఖలీఫా.. వృత్తి జీవితం పక్కన పెడితే.. ఆమెకు కార్స్ అంటే చాలా ఇష్టమట. మార్కెట్ లోకి కొత్తగా ఏ కారు వచ్చినా ఇష్టపడితే మాత్రం కొనకుండా ఊరుకోదట. అదీగాక మియా దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ విలువ సుమారు రూ. 31 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మియాకి కార్స్ అంటే ఎంత ఇష్టమో. ప్రస్తుతం మియా ఖలీఫా దగ్గర ఉన్న కార్ల కలెక్షన్స్ లో అంత్యంత ఖరీదైన కార్స్ లిస్ట్ చూస్తే ఆశ్చర్యం కలగకతప్పదు.
మియా ఖలీఫా దగ్గరున్న ఖరీదైన కార్స్ లిస్ట్ చూసినట్లయితే..
1) లెక్సస్ ఈఎస్ (Lexus ES): లెక్సస్ ఈఎస్ ధర 39,900 డాలర్లు అంటే.. సుమారు రూ. 30 లక్షలు ఉంటుంది.
2) బీఎండబ్ల్యూ ఎం4 (BMW M4): బీఎండబ్ల్యూ ఎం4 కారు విలువ సుమారు 69,150 డాలర్లు అంటే.. సుమారు రూ. 53 లక్షలుగా ఉంది.
3) జీప్ రాంగ్లర్ (Jeep Wrangler): జీప్ రాంగ్లర్ విలువ సుమారు 31,000 డాలర్లు అంటే.. సుమారు రూ. 24 లక్షలుగా ఉంది.
4) ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా (Ferrari F12 Berlinetta): ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా ధర 319,995 డాలర్లు అంటే.. సుమారు రూ. 2.48 కోట్లు.
5) బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Bentley Continental GT): దీని ప్రస్తుత విలువ 222,085 డాలర్లు అంటే సుమారు రూ.1.72 కోట్లు ఉంది.
6) ఆడి ఆర్8 స్పైడర్(Audi R8 Spyder): ఆడి ఆర్8 స్పైడర్ విలువ సుమారుగా 154,900 డాలర్లు అంటే.. సుమారు రూ.1.20 కోట్లుగా ఉంది.
ఈ కార్స్ కేవలం మియా దగ్గరున్న వాటిలో విలాసవంతమైనవి. ఇంకా ఆమె దగ్గర చాలా కార్లు ఉన్నాయట. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న మియా ఖలీఫా కార్ కలెక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మియా ఖలీఫా కార్ కలెక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
I’m still typing 💬 … pic.twitter.com/KkQhSAfhWb
— Mia K. (@miakhalifa) May 30, 2022