మియా ఖలీఫా.. ఈ రిటైర్డ్ అడల్ట్ స్టార్ పేరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు ఆమె ఫొటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. కారణం లేకుండా అలా చేయడం లేదులెండి.
మియా ఖలీఫా.. ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని అభిమాన సైన్యాలే ఉన్నాయి. ఈ అడల్ట్ తార.. సింగిల్స్ కలల రాణిగా చెబుతుంటారు. ఈమెకు అభిమానులే కాదు.. భక్తులు కూడా ఉన్నారు. పో*ర్న్ స్టార్ గా రిటైర్డ్ అయిన ఈ లెబనాన్ బ్యూటీ.. ప్రస్తుతం అడల్ట్ మోడల్ గా కొనసాగుతోంది. ఓన్లీ ఫ్యాన్స్ సైట్ లో అకౌంట్ ఓపెన్ చేసి తన బోల్డ్ చిత్రాలను పోస్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ అంటూ ఫ్యాన్స్ ఎక్కడా డిస్కరైజ్ చేయడం లేదు. ప్రస్తుతం మియా ఖలీఫా పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందుకు ఒక పెద్ద కారణమే ఉంది.
మియా ఖలీఫా రిటైర్డ్ అయినా కూడా ఆమెను ఫ్యాన్స్ మాత్రం మర్చిపోవడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు(ఫిబ్రవరి 10) ఆమె పుట్టినరోజు సందర్భంగా నెట్టింట తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మియా ఖలీఫా నీకు జన్మదిన శుభాకాంక్షలు అని కొందరు, మా అభిమాన తారకు హ్యాపీ బర్త్ డే ఇంకొందరు కామెంట్లు, ఫొటోలు షేర్ చేస్తూ ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె మీద వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు మీమర్స్ కూడా ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ పుట్టిరోజు సందర్భంగా పొగుడుతూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు.
మియా అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంల తన కుక్క పేరు మియా, అమెరికన్ ర్యాపర్ విజ్ ఖలీఫా పేర్లను కలిపి.. మియా ఖలీఫాగా పెట్టుకుంది. ఆమెకు హిస్టరీలో బ్యాచలర్ డిగ్రీ కూడా ఉంది. 22 ఏళ్ల వయసులో అడల్ట్ తారగా మారింది. ఆమె హిజాబ్ తో చేసిన మొదటి వీడియో తెగ వైరల్, విమర్శలకు గురైంది. దాంతో అంతా మియా అంటే ఎవరు అని వెతకడం మొదలు పెట్టారు. ఆ వివాదం తర్వాత మియాని తల్లిదండ్రులు వదిలేశారు. మియా ఖలీఫా అంటే పో*ర్న్ స్టార్ గానే అందరికీ తెలుసు. కానీ, ఆమె ఓ పుస్తకాల పురుగు అని చాలా తక్కవ మందికే తెలుసు. ఆమె ఎప్పుడూ తనతో ఒక సూట్ కేస్ తీసుకెళ్తుంటుంది. దాని నిండా పుస్తకాలే ఉంటాయంట. ఆమె తన ఇంటిని పుస్తకాలతో నింపేసిందని చెబుతుంటారు.