కామెడీ రోజురోజుకీ మితిమీరిపోతుందా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 'జబర్దస్త్' షోలో కమెడియన్స్ చాలా విషయాల్ని ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. అలా ఇమ్ము-రష్మీ మాట్లాడిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగులో కామెడీ అనగానే ప్రస్తుతం చాలామందికి గుర్తొచ్చే పేరు ‘జబర్దస్త్’. ఓ షోకి ఇంతలా పాపులారిటీ రావడం అంటే సాధారణ విషయం కాదు. దాదాపు పదేళ్ల నుంచి సక్సెస్ ఫుల్ రన్ అవుతున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది విశేషమైన పాపులారిటీ దక్కించుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి వాళ్లు ఈ విషయంలో కచ్చితంగా టాప్ లో ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ‘జబర్దస్త్’లో కామెడీ పరిధులు దాటుతుందేమో అనిపిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే అదే అనిపిస్తుంది. మరి ఇంత డైరెక్ట్ గా ఎలా మాట్లాడేస్తున్నారా బాబు అనుకునేలా చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతివారం కామెడీ స్కిట్లతో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తున్న వాటిలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కామెడీ పేరుతో యదేచ్ఛగా నీలి చిత్రాల్లో నటించే తారల గురించి అప్పుడప్పుడు మాట్లాడేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమోలో అది కనిపించింది. బుల్లెట్ భాస్కర్ ఈసారి ఇంద్ర స్పూఫ్ ని స్కిట్ గా చేశాడు. ఇందులో హీరోయిన్ గా వర్ష చేస్తే.. దుబాయి షేక్ గా ఇమ్ము కనిపించాడు. భాస్కర్, డైరెక్టర్ రోల్ లో కనిపించాడు. స్కిట్ అంతా సరదా సరదా సాగిపోయినప్పటికీ ఓ డైలాగ్ మాత్రం నెటిజన్స్ ని ఆలోచనలో పడేసింది.
డైరెక్టర్ గా చేసిన బుల్లెట్ భాస్కర్.. ఓ సీన్ లో భాగంగా ‘సినిమా కంప్లీట్ అయిపోయింది. 200 కోట్లు, నాలుగు బావులు కొంటున్నారు. దుబాయిలో అదేదో ఉంటుంది ఏంటది’ అని ఇమ్మును అడుగుతాడు. ‘బుర్జ్ ఖలీపా’ అని చెప్పిన ఇమ్ము.. వర్ష వైపు చూపించి ‘మియా ఖలీపా’ అని అంటాడు. వెంటనే రియాక్ట్ అయిన యాంకర్ రష్మీ.. ‘ఇమ్ము.. చాలా వీడియోలు చూస్తున్నట్లున్నావ్ ఈ మధ్య నువ్వు’ అనేసింది. దీన్ని కవర్ చేయడానికా అన్నట్లు.. ‘క్యాబోలా నేను సబ్ స్క్రైబర్ ని’ అని అన్నాడు. దీంతో సెట్ అంతా పగలబడి నవ్వారు. మరి ఏకంగా స్టేజీపైనే రష్మీ-ఇమ్ము అలాంటి వీడియోస్ గురించి మాట్లాడటంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.