భవానీపూర్‌ ఎన్నికల్లో మమతా ఘన విజయం

mamata banerjee

భవానీపూర్‌ ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బీజేపీ అభ్యర్థి అయిన ప్రియాంక టిబ్రేవాల్‌ మీద 58,389 ఓట్లతో మమతా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మమతా బెనర్జీ విజయం సాధించటంతో ఆమె ఇంటి ముందు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక భవానీపూర్ తో పాటు జంగీపూర్‌, సంషేర్‌ గంజ్‌ వంటి స్థానాల్లో సైతం టీఎంసీ పార్టీ అభ్యర్ధులు ముందు వరుసలో కొనసాగుతుండటం విశేషం. ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి సువెందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో ఆ స్థానంలో ఓడిపోవటంతో మళ్లీ భవానీపూర్ స్థానం నుంచి మరోసారి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా మమతా మూడోసారి కొనసాగనుంది.