కూతురు ప్రేమించిన యువకుడిపై సుత్తితో దాడి!.. వీడియో వైరల్!..

A Man Attack With Hamer - Suman TV

ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంగా సొంత బిడ్డలను సైతం హతమార్చే పరువు హత్యలు  తరచుగా జరుగుతుంటాయి. ఎన్ని చట్టాలు వచ్చినా, పోలీసు వ్యవస్థ ఉన్నా పరువు హత్యల జోరు తగ్గడం లేదు.  లేటెస్ట్ గా  ఓ యువకుడిపై అతని ప్రియురాలి తండ్రి, అన్న నడిరోడ్డుపై విచక్షణారహితంగా సుత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.  పుష్పక్ భావ్సర్  అనే యువకుడు మక్సి నగరంలోని ఓ యువతి ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి పారిపోయారు. అనంతరం యువతి తల్లిదండ్రులు, పెద్దలు వారిని ఇంటికి రావల్సిందిగా కోరగా వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు.  అయితే వారు ఇంటికి వచ్చిన తర్వాత యువతి కుటుంబసభ్యులు పుష్పక్‌పై తీవ్రమైన కోపంతో రగిలిపోయారు.

A Man Attack With Hamer - Suman TV పుష్పక్‌ ఓ సెలూన్ లో ఉన్న సమయం చూసి యువతి తండ్రి, అన్న ఒక్కసారిగా షాప్‌ నుంచి అతన్ని బయటకు లాక్కొచ్చారు. అనంతరం అత్యంత రద్ధీగా ఉండే మక్సీ వీధిలో వెంబడించి మరీ సుత్తి, ఇనుప రాడ్‌తో విచాక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో పుష్పక్‌ కాలు, చేతికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై యువకుడి తల్లిదండ్రులు  యువతి తండ్రి, అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.