మెట్రో తరహాలో హైదరాబాద్ కు మరో కొత్త ప్రాజెక్టు!

Lightrail Hyderabad Telangana

హైదరాబాద్ నగరంలో MMTS రైళ్లల్లో నగర ప్రయాణికులు ప్రయాణిస్తూ తమ గమ్యానికి చేరుకుంటున్నారు. అయితే నగరాలు అభివృద్ధి చెందుతుండటంతో ప్రజా రవాణా వ్యవస్థ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ ఇతర నగరాల్లో చూసుకుంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ వంటి రైలు రవాణా వ్యవస్థ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే ప్రస్తుతం మన దేశంలో అనేక నగరాల్లో ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇక గత కొన్నేళ్ల కిందట మన హైదరాబాద్ లో నగరంలో కూడా మెట్రో రైలు ప్రారంభమై పరుగులు పెడుతోంది. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరానికి మరో కొత్త టెక్నాలజీతో కూడి LRTS (లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌) అందుబాటులోకి రానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ దిశగా రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనలు కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ప్రాజెక్ట్ ను ముందుగా హైదరాబాద్‎లో ఎంఎన్‎సీ కంపెనీలు ఉన్న గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట వంటి ప్రాంతాల్లో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోందట. ఇప్పటికే నగరంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఇక లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కూడా తోడైతే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.