బిగ్‌ బ్రేకింగ్‌: భారత మాజీ క్రికెటర్‌ కు ఉగ్రవాదుల బెదిరింపులు..

gambir

ఇటీవల కాలంలో ప్రముఖులకు ఉగ్రవాదుల, ఆకతాయిల నుంచి బెదిరింపు కాల్స్ రావటం ఎక్కువయ్యంది. గతంలో తమిళ హీరో విజయ్ కి కూడా బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది ఆకతాయి పని పోలీసులు తేల్చారు. కానీ తాజాగా భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వస్తున్నట్లు ఢిల్లీ పోలీసులకు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేశారు.

ఐసిస్ కాశ్మీర్ ఉగ్రవాదుల పేరిట బెదిరింపులు వస్తున్నట్లు గౌతమ్ గంభీర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గంభీర్ ఫిర్యాదు మేరకు ఆయన నివాసానికి భద్రత పెంచారు. బెదిరింపులపై దర్యాప్తు జరుగుతోందని సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. ఢిల్లీ సెంట్రల్ డీసీపీకి రాసిన లేఖలో ‘ఐసిస్ కాశ్మీర్’ అనే ఈమెయిల్ నుండి తనకు బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు. ‘మేము నిన్ను మరియు మీ కుటుంబాన్ని చంపబోతున్నాము’ అని రాసి ఉందని తెలిపారు.

గతంలోనూ గంభీర్ కు బెదిరింపు కాల్స్

గంభీర్‌ కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. అంతకు ముందు డిసెంబర్ 2019లో ఇంటర్ నేషనల్ నంబర్ నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో షహదారా మరియు సెంట్రల్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాశారు. ప్రస్తుతం ఢిల్లీ తూర్పు నియోజకవర్గానికి ఎంపీగా గౌతమ్ గంభీర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.