భారత్ లో కొత్తగా 6990 కరోనా కేసులు.. మరణాలు 190 నమోదు

ప్రపంచ వ్యాప్తంగా రెండేళ్లుగా కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తుంది. లక్షల్లో కేసులు.. మరణాలు సంబవించాయి. కరోనా ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది . ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న సమయంలో కొత్తగా డేల్టా వేరియంట్ వచ్చి అతలాకుతలం చేసింది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రజల్లో భయం మొదలైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే సెకండ్ వేవ్ తర్వాత భారత్ లో కరోనా కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి.

image 0 compressed 48తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 6,990 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 1,00,543 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 190 మంది మృతి చెందారు. ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,23,25, 02,767 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.

image 2 compressed 40ఇక తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ట స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 33,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 6,75,798 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,68,227 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,581 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,990కి పెరిగింది.