రైతులకు కేంద్రం ప్రభుత్వం తీపి కబురును అందించింది. పీఎం కిసాన్ 10వ విడత నిధుల విడుదలకు కేంద్రం సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా అర్హులైన రైతుల అందరికీ ఏడాదికి రూ.6000 అందుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి నాలుగు దఫాలుగా రూ.2000 చొప్పున అందిస్తుంది. కాగా 10వ నిధుల విడుతల్లో భాగంగా డిసెంబర్ 15 నాటికి అర్హులైన రైతుల ఖాతాలోకి డబ్బును జమ చేయనట్లు తెలిపింది.
ఇక ఈ పథకంలో పేర్లు లేని కొత్త రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌లో ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఇక పీఎం కిసాన్ నిధి అధికారిక వెబ్ సైట్ లో రైతులు తమ పేర్లు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలంటూ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో అర్హులైన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.