మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం అంగీకారం.. అసలు వ్యవసాయ చట్టాల్లో ఏముంది?

Farm Laws Modi Bjp

మోదీ సర్కార్ సంచనల నిర్ణయం తీసుకుంది. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలు రద్దుకు ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. అయితే సుధీర్ఘ కాలంలో ఈ చట్టాలపై రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం తాజాగా జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకారం తెలిపారు.

ఇక దీంతో పాటు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల రద్దు దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఇన్నాళ్లు రైతులను ఇబ్బందులకు గురి చేసినందుకు క్షమించాలంటూ రైతులను ప్రధాని క్షమాపణలు కోరారు.  అసలు ఈ మూడు సాగు చట్టాల్లో దాగి ఉన్న అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.Farm Laws Modi Bjpజూన్ 15, 2020న మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టడం, 2020 సెప్టెంబర్ 17న బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపడం, 2020 సెప్టెంబర్ 20న బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించడం వంటవి అన్ని చకచక జరిగిపోయాయి. అయితే ఈ చట్టాలపై మరీ ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలోని రైతులు పూర్తి వ్యతిరేకతను తెలిపారు. రైతులకు ఎలాంటి లాభం లేని ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ 2020 నవంబర్ 26న నిరసనలు తెలియజేశారు. ఛలో ఢిల్లీ పేరుతో రైతులంతా హస్తిన బాట పట్టారు.Farm Laws Modi Bjpట్రాక్టర్లతో ర్యాలీలు చేపట్టడంతో రైతులను పోలీసులు ఎక్కడి వారిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో ఉద్యమం మరింత తీవ్ర తరం అయింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై చేసిన అల్లరికి ప్రపంచ మీడియా సైతం ఆ ఉద్యమాన్ని కవర్ చేసింది. రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున బ్యారికేడ్లు, బండరాళ్లను రోడ్లపై అడ్డంగా పెట్టి రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ రైతులు మాత్రం ఏ మాత్రం లెక్క చేయక నేటికి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఇక ఏకంగా ఏడాదిన్నరకు పైగా సాగిన రైతుల దీక్షలు ఎట్టకేలకు ఫలించటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూడు వ్యవసాయ చట్టాల్లో దాగిన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బిల్లు 1 : ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు(సాధికారత,రక్షణ) 2020-బిల్లురైతులు పండించబోయే పంటకు ముందుగానే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. నిర్ణీత కాలానికి ప్రైవేట్ వ్యాపారి రైతులు ఒప్పందం చేసుకుని పంటలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఎవరికైనా అమ్ముకునే అధికారం ఉంటుంది.

బిల్లు 2: నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు 2020 బిల్లు
ఈ రెండవ చట్టంలో ధాన్యం, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, వంటి నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. కోల్ట్ స్టోరేజీలు,వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాల కల్పన

బిల్లు 3: వ్యవసాయ ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020
ఇక చివరి చట్టాన్ని చూసుకుంటే గనుక ఉత్పత్తుల రైతులు పండించిన పంటలను అమ్మకాలు జరిపే వషయంలో ప్రైవేట్ వ్యాపారులకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. రైతులు పండించిన తమ పంటలను అమ్ముకునే వేసులుబాటు కలిగి ఉండటం. త ద్వారా మార్కెట్ యార్డులకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ధరల నియంత్రణ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ప్రైవేట్ వ్యాపారులే రైతు వద్దకు వచ్చి కొనుగోలుFarm Laws Modi Bjpఇక ఒకవేళ ఈ చట్టాలు కనుక అమలైతే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని రైతులు ఆవేదన చెందటంతో నిరసనలకు దిగారు. ఈ చట్టాలు అమలైతే మరీ ముఖ్యంగా మార్కెట్ యార్డులు ఉండవు. అయితే దీంతో వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడే వ్యాపారలుకు నిరాశ మిగిలేది.