రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పాలన తీరు సరిగా లేదని తెలియజేస్తూ బీజేపీ ఎమ్మెల్యే నడిరోడ్డుపై గుండు చేయించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర ఎమ్మెల్యే ఆశిశ్ దాస్ తమ పార్టీ చేసిన తప్పులకు గాను శిక్షగా గుండు చేయించుకున్నట్లు తెలిపారు. కోల్‌కత్తాలోని కాళీఘాట్ వద్ద తలనీలాలు సమర్పించిన ఎమ్మెల్యే అనంతరం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.