ప్రపంచంలో అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ గత కొంత కాలంగా రక రకాలుగా చర్చ జరుగుతోంది. తాజ్ మహల్లో ఉన్న గదుల్లో హిందూ విగ్రహాలున్నాయని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాని గుట్టు విప్పాలంటూ అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. తాజాగా తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదులను తెరువాలంటూ దాఖలైన పిల్‌ను అలహాబాద్ హైకోర్టు గురువారం తిరస్కరించింది. లక్నో బెంచ్ న్యాయమూర్తులు డీకే ఉపాధ్యాయ, సుభాష్ విద్యార్థి, పిటిషన్‌దారుడిపై మండిపడ్డారు.
ఇది చదవండి: Nalgonda: తాను చనిపోతూ.. ఐదుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!
తాజ్‌మహల్‌పై పూర్తి స్థాయి పరిశోధన చేసిన తర్వాతే.. పిల్ వేయాలని పిటిషనర్‌ని మందలిచింది. పిల్‌ను ఎగతాళి చేయవద్దని.. కనీసం అవగాహన లేకుండా.. ఇష్టానుసారం పిల్ వేస్తారా? అని మండిపడింది. అంతే కాదు ఇది చారిత్రాత్మక కట్టడమని.. తాజ్‌మహల్‌ను ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారన్న వివరాలు తెలుసుకోవాలని చివాట్లు పెట్టింది. కాగా, తాజ్‌మహల్ ముంతాజ్ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమని ప్రచారంలో ఉంది.
ఇది చదవండి: ఆధార్ – పాన్ లింక్ చేయలేదా? అయితే.. ఇకపై లావాదేవీలు చేయడం కష్టమే..!
ఈ నేపథ్యంలో దాని గుట్టు విప్పాలంటూ అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఆ గదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ క్రమంలో గురువారం అలహాబాద్ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
- మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.