సహజీవనం చేస్తున్నవారికి హైకోర్ట్ షాకిచ్చింది. ఆ అబ్బాయిలతో లేదా ఆ అమ్మాయిలతో సహజీవనం చట్టబంద్దం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
నేటి కాలంలో యువతీ యువకులు సహజీవనంపేరుతో పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్నారు. ఈ సహజీవన వ్యవహారం ఎక్కువగా పాశ్చాత్య దేశాలల్లో కనిపిస్తుంది. రాను రాను భారత్ లో కూడా విస్తరిస్తోంది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయొచ్చు. ఆ తర్వాత వారికి ఇష్టమైతే వివాహబంధం ద్వారా ఒక్కటవ్వడం లేదా సహజీవనానికి స్వస్థి చెప్పడం చేస్తుంటారు. సహజీవన బంధంలో కొనసాగుతూ పిల్లలను కూడా కంటుంటారు కొందరు. అయితే తాజాగా సహజీవనంపై అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. అలాంటి అబ్బాయిలు లేదా అలాంటి అమ్మాయిలతో సహజీవనం చట్టవిరుద్దమని పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం..
కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు మైనార్టీ తీరక ముందే ప్రేమించుకోవడం, సహజీవనం చేయడం చేస్తున్నారు. ఇలాంటి వారికి అలహాబాద్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. 18 యేళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మైనర్ అబ్బాయి వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేయడం చట్టవిరుద్దమని కోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్లు నిండని అబ్బాయిలతో, అతడి కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలు సహజీవనం చేస్తే అది చట్ట విరుద్దమని కోర్టు తెలిపింది. అసలు ఏం జరిగిందంటే..
యూపీకి చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లోంచి బయటకు వచ్చి సహజీవనం చేస్తున్నారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రలు తమ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తరువాత అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయి, అమ్మాయి ఆచూకీ తెలుసుకుని స్వస్థలానికి తీసుకొచ్చారు. తల్లిదండ్రుల నుంచి తప్పించుకున్న అమ్మాయి ఈ విషయాన్ని అబ్బాయి తండ్రికి చేరవేసిది. దీంతో అబ్బాయి తండ్రి కొడుకు తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అబ్బాయిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ న్యాయస్థానం 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది. మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా సహజీవనం చేసేందుకు హక్కు ఉంటుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.