తమిళనాడులో సంచలనంగా మారిన అఘోరాల వివాహం

గతంలో తన తల్లి ఆత్మశాంతి కోసం ఆమె మృతదేహంపై కూర్చుని ప్రార్థనలు చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపారు అఘోరా మణికంఠన్. అదేవిధంగా ఇటీవల అగ్ని ప్రమాదంలో మరణించిన శిష్యుడి మృతదేహంపై కూర్చొని అన్నమ శాంతి పూజలు నిర్వహించి.. మరో సారి సంచలనంగా మారిన మణికంఠన్… తాజాగా తన శిష్యురాలైన అఘోరిని పెళ్లి చేసుకోవడం సంచనలంగా మారింది.

gasdg min
తమిళనాడు లోని తిరుచ్చి జిల్లా అరియమంగళానికి చెందిన మణికంఠన్ కాశీ లో అఘోర ఉపాసన చేసి తన సొంత గ్రామానికి వచ్చి జై అఘోర కాళీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నాడు. మణికంఠన్ అఘోరా సమాధుల వద్ద పూజలు చేస్తూ.. తన శిష్యులకు అఘోర ఉపాసనం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో తన దగ్గర శిష్యులుగా ఉన్న అఘోరని మణికంఠన్ పెళ్లిచేసుకున్నాడు. కలకత్తాకు చెందిన తన శిష్యురాలైన ప్రియాంక అఘోరిని హిందూ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. ప్రియాంక ఎనిమిదేళ్లుగా మణికంఠన్ వద్ద అఘోరీలకు శిక్షణ ఇస్తోంది.

ఈ నేపథ్యంలో అఘోరి గురువు మణికంఠన్‌తో ప్రియాంక వివాహం నిన్న తెల్లవారుజామున జరిగింది. వివాహ సమయంలో దంపతుల శరీరమంతా జల్లులతో అఘోరి కోలంలోనే ఉండటం విశేషం. వివాహ అనంతరం దంపతులిద్దరు కరుప్పస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. వివాహానికి ముందుకు యజ్ఞం చేస్తున్నప్పుడు తోటి అఘోరాలు మృదంగం మోగిస్తూ, శంఖం ఊదుతూ నాట్యాలు చేశారు. అఘోర దంపతుల వివాహం గురువు సిద్ధార్థ్ వే మదురైపాల్సామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ అఘోరాల పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.