సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెళ్లికి ముందు కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉంటు తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల డేటింగ్ కల్చర్ బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో డేటింగ్ అనేది సర్వసాధారణం అయ్యింది.. కొంత కాలం తర్వాత వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు.
ఇటీవల సినీ సెలబ్రెటీలు కొంతకాలం సహజీవనం చేసి తర్వాత వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో కొంతమంది సీక్రెట్ గా వివాహం చేసుకొని తర్వాత మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి మహిగిల్ వివాహం చేసుకున్నట్లు ధృవీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా మీడియా వేధికగా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ పంజాబీ నటి మహి గిల్, వ్యాపార వేత్త, నటుడు అయిన రవి కేషర్ ని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. కాకపోతే పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు ఆమె బయట పెట్టలేదు. 2019 వెబ్ సిరీస్ ఫిక్సర్‌లో ఇద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి ఈ జంట కలిసి ఉంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా మహి గిల్ మాట్లాడుతూ.. ‘నేను నటుడు, వ్యాపార వేత్త అయిన రవికేషర్ ని వివాహం చేసుకున్నాను.. మేం ఇద్దరం చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నాం.. మాకు కూతురు ఉంది.. పేరు వెరోనిక. మేం అందరం ప్రస్తుతం గోవాలో నివిస్తున్నానమని’ తెలిపింది. ఇదిలా ఉంటే 2019 లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహి గిల్ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
తనకు వెరోనికా అనే కూతురు ఉందని.. ఆగస్టు లో తనకు రెండేళ్లు నిండుతాయని తెలిపింది. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడం ఏంటని మీడియా ప్రశ్నకు సమాధానంగా.. పెళ్లి లేకుండా పిల్లల్ని కంటే తప్పేముంది.. తాను రిలేషన్ లో ఉన్నాను.. ఒక కూతురుకి తల్లైనందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపింది. పెళ్లి అనేది అద్భుతమైనది.. పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తిగత నిర్ణయం అని తెలిపిందే. పెళ్లి చేసుకోకుండానే కుటుంబం, పిల్లల్ని కలిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. అప్పట్లో మహిగిల్ మాటలు మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. గోవిందా తో హే బ్రో, సల్మాన్ ఖాన్ తో దబాంగ్ 3తో పాటు పంజాబీ, బాలీవుడ్ లో దాదాపు 40 పైగా చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
‘I Am Married’! Mahie Gill Secretly Ties The Knot With Entrepreneur Ravi Kesarhttps://t.co/5Thi55ov1e
— TIMES NOW (@TimesNow) April 18, 2023