ఆడపిల్ల పుట్టింది.. నటరాజ్ మాస్టర్ కోరిక నెరవేరింది

హైదరాబాద్- నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ రియాల్టీ షో కు వచ్చిన సందర్బంగా ఎంత ఎమోషనల్ అయ్యాడో అందరికి తెలుసు. తన భార్య ఏడో నెల గర్భంతో ఉందని, బిగ్ బాస్ షోలో పాల్గొనాలా.. వద్దా అని ఎంతో ఆలోచించానని చెప్పాడు. కానీ చివరికి బిగ్ బాస్ షోలో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్. తనకు పుట్టబోయే బిడ్డను తన చేతులతో ఎత్తుకుంటానో.. లేదో అని చాలా ఆందోళన చెందాడు.

బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్నాల్లు తన భార్య, పుట్టబోయే బిడ్డ గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యేవాడు నటరాజ్ మాస్టర్. ఆయన భార్య సీమంతం వేడుకలకు సంబంధించిన వీడియోను బిగ్ బాస్ హౌజ్ లో ప్లే చేసి చూపించడంతో నటరాజ్ మాస్టర్ ఓ దశలో సంతోషంతో ఏడ్చేశాడు. ఇదిగో ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కోరిక నెరవేరింది. నటరాజ్ మాస్టర్ భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Nataraj Master 1

ఈ విషయాన్ని నటరాజ్ మాస్టర్ తెలిపారు. పండంటి బిడ్డ పుట్టిందంటూ నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అమ్మాయి పుట్టాలని తాను కోరుకున్నానని,. అబ్బాయి పుట్టాలని తన భార్య కోరుకుందని చెప్పాడు. ఎవరు పుట్టినా తమకు ఓకే అన్నాడు. అయితే నటరాజ్ మాస్టర్ కోరిక మేరకు ఆడపిల్లే పుట్టింది. ఇంకేముంది ఆయన ఆనందానికి అంతే లేదని చెప్పాలి.

తనకు బిడ్డ పుట్టిన సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఆస్పత్రి నుంచే లైవ్ లోకి వచ్చాడు నటరాజ్ మాస్టర్. హాస్పిటల్‌ లో తన భార్యను, తన బంధువులను అందరినీ లైవ్ లో చూపించాడు. మొత్తానికి ఇది నాకు ఎంతో మంచి రోజు, ఇన్ని రోజులు ఎదురుచూసింది ఈ రోజు కోసమే, మమ్మల్ని ప్రేమిస్తున్న అందరికీ శుభవార్త చెప్పబోతోన్నాను.. అంటూ ఓ లైవ్ వీడియో చేశాడు. తనకు పాప పుట్టిన విషయాన్ని చెప్పాడు. మొత్తానికి నటరాజ్ మాస్టర్ కోరిన నెరవేరిందంటూ నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Natrajmaster (@natraj_master)