చై-సామ్ మద్య జరిగిన పర్సనల్, విడాకులపై స్పందించిన నాగార్జున

ఫిల్మ్ డెస్క్- ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా నాగ చైతన్య, సమంతల విడాకుల గురించే చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా వీళ్లిద్దరు విడిపోతున్నారని అంతా అుకుంటున్నా.. అందులో నిజమెంత ఉందో, అబద్దం ఎంత ఉందో తెలియక చాలా మంది కన్ఫూజ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు తామిద్దరం విడిపోతున్నాం అని నాగచైతన్య, సమంత అధికారికంగా ప్రకటించడంతో అందరికి క్లారిటీ వచ్చేసింది.

ఇక నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంపై అక్కినేని ఫ్యామిలీ పెద్ద నాగార్జున స్పందించారు. ఇలా జరగడం దురదృష్ణకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఐనా అది వాళ్లిద్దరి పర్సనల్ అంశమని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈమేరకు నాగార్జున ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబంతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిపోలేనని, జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పుకొచ్చారు నాగార్జున.

whatsapp image 2021 08 31 at 3 2

అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో ఏమన్నారంటే.. బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను.. ఆ ఇద్దరికి ఇలా జరగడం చాలా దురదృష్టకరం.. భార్యభర్తలైన చై, సామ్ మధ్య జరిగింది పర్సనల్.. ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు.. నేను, నా ఫ్యామిలీతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. వారిద్దరికి బలం చేకూర్చాలని ఆ దేవుడిని కోరుతున్నాను.. అంటూ పోస్ట్ వేశారు.

ఇక నాగచైతన్య, సమంతల విడాకులపై సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవ్వరు స్పందించడం లేదు. ఎందుకంటే ఇది నాగార్జున చెప్పినట్లు వాళ్లిద్దరికి సంబందించిన పర్సనల్ ఇష్యూ. ఐతే కస్తూరీ శంకర్, ఆర్జీవీ వంటి వారు చైతన్. సమంతల విడాకులపై స్పందించారు. కస్తూరీ శంకర్ అయితే నేరుగా నాగచైతన్య. సమంతల పేర్లతో పెట్టేసి ట్వీట్ చేశారు. ఇక రాంగోపాల్ వర్మ మాత్రం సెటైరికల్ కామెంట్ చేశారు. పెళ్లి అనేది చావు లాంటిది.. విడాకులు అనేది మళ్లీ పుట్టడం లాంటిది తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు. పెళ్లంటే రోగం అని, విడాకులు అంటే మందు అని ఎప్పటిలాగే చెప్పుకొచ్చారు ఆర్జీవి.