ఆక్సిజన్ సిలండర్ తో బ్యాంక్ కి వచ్చిన మేనేజర్ చెప్పిన కారణం ఏంటో తెలుసా?..

జార్ఖండ్ – బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పేరు అరవింద్ కుమార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్. ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే సడెన్ గా ఆయన తన భార్య, కొడుకుకు, ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకుని ఆఫీసుకి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఎందుకిలా చేశారంటే తనకు లీవ్ అడిగితే ఇవ్వలేదని, మరో దారి లేక ఇలా ఆఫీసుకి వచ్చానని అరవింద్ కుమార్ చెప్పారు. తాను  పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇన్ ఫెక్షన్ ఎక్కువగా ఉంది. లంగ్స్ లోకి వెళ్లింది. అందుకే మూడు నెలలు రెస్ట్ అవసరం,    లీవ్ కావాలని అడిగాను. కానీ, యాజమాన్యం ఒప్పుకోలేదు. లీవ్ ఇవ్వకుండా ఆఫీసుకి రావాలని వేధింపులకు గురి చేసింది. మరో దారి లేక ఇలా ఆక్సిజన్ సిలిండర్ తో ఆఫీసుకి వచ్చానని అరవింద్ కుమార్ చెప్పారు.

Jharkhand

అరవింద్ కుమార్ ఆక్సిజన్ సిలిండర్ తో ఆఫీసుకి రావడాన్ని అతడి కుటుంబసభ్యులు వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. లీవ్ ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని అరవింద్ కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారం దుమారం రేపడంతో బ్యాంకు యాజమాన్యం స్పందించింది. అరవింద్ కుమార్ ఆరోపణలను కొట్టిపారేసింది. అదంతా డ్రామా అని తేల్చింది. లోన్ అకౌంట్స్ లో అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించి విచారణ జరుగుతోందని వివరించింది. దీని నుంచి తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ ఇలా డ్రామా ఆడినట్టు తెలిపింది. అరవింద్ కుమార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయంది. గత రెండేళ్లుగా పర్మిషన్ లేకుండానే ఆయన ఆఫీసుకి రావడం లేదని యాజమాన్యం చెప్పింది. కరోనా బారిన పడ్డ ఉద్యోగులకు లీవ్ ఇవ్వడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదంది.