కత్రినా కైఫ్, విక్కీ విశాల్ పెళ్లి డేట్ ఫిక్స్

ఫిల్మ్ డెస్క్- కత్రినా కైఫ్.. ఈ బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఓ ఇంటిది కాబోతోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయ్ని కత్రినా కైఫ్.. ఎట్టకేలకు పెళ్లి పీఠలెక్కబోతోంది. సల్మాన్ ఖాన్ నుంచి మొదలు పలువురు బాలీవుడ్ హీరోలతో ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు.. వాళ్లందరిని కాదని విక్కీ విశాల్ ను పెళ్లాడపోతోంది.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బాలీవుడ్‌ లో ట్రెండింగ్ టాపిక్‌ అని చెప్పాలి. ఇక డిసెంబరు రెండో వారంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. డిసెంబరు 9న కత్రినా, విక్కీ పెళ్లి జరగనుందని సమాచారం. డిసెంబరు 9న వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కత్రినా కైఫ్ దగ్గరి బంధువు ఒకరు తెలిపారు. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో ఆ రోజు సాయంత్రం వీరి వివాహం జరగనుంది.

vickykatrina

ఇక కత్రినా కైఫ్, విక్కీ విశాల్ పెళ్లికి కుటుంబాలకు ఇరువురి కుటుంబాలకు చెందిన దగ్గరి బంధవులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారని కత్రినా కైఫ్ సన్నిహితులు తెలిపారు. పెళ్లికి ముందు జరిగే మెహందీ, సంగీత్ డిసెంబర్ 7, 8 వ తేదీల్లో జరగబోతున్నాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా 200 మంది వరకు హాజరు కాబోతున్నారట.

పెళ్లికి ఇంకా 12 రోజులు మాత్రమే సమయం ఉండటంతో కత్రినా కైఫ్ ఆ పనుల్లో బిజీగా ఉంది. బాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులు రెండు రోజుల ముందుగానే రాజస్థాన్ కు చేరుకోనున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. వారి కోసం ఇప్పటికేే సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో అన్ని ఏర్పాట్లు చేశారట. పెళ్లి తరువాత మంచి మ్యూజిక్ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారని సమాచారం.