బద్వేల్ బరిలో.. బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన!

గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలో భలే రంజుగా సాగుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాన్ని మార్చివేయనుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో విజయం ఏకపక్షమేనని అర్థమవుతోంది. ఇటీవల బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

badvel minఈ క్రమంలో ఆయన సతీమణి వైసీపీ అభ్యర్తి డాక్టర్ సుధ బరిలో నిలిచింది. అధికార బలంతోపాటు సానుభూతి పవనాలు వైసీపీ అభ్యర్థికి ప్లస్ కానున్నాయి. అయితే బద్వేల్ బరిలో వైసీపీ కి టీడీపీ, జనసేన గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా ఈ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నిలుస్తోందని.. ఈ ఎన్నిక‌ బ‌రిలో నిలిచే త‌మ పార్టీ అభ్య‌ర్థి పేరును బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించారు. గత 5 సంవ‌త్స‌రాలుగా యువనాయకుడిగా ప్రజా సమస్యల సాధనకు అనేక పోరాటాలు సాగించిన సురేశ్ ప‌న‌తల ని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మద్య బీజేపీ-జనసేనకు మద్య కొన్ని విభేదాలు వచ్చినట్లు ఈ మద్య సోషల్ మీడియాలో తెగ వార్తలు పుట్టుకు వచ్చాయి. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ.. బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

monar minబద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక నేపథ్యం లో ఇవాళ జనసేన పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జీ నాదెండ్ల మనోహర్ ఆసక్తి కర కామెంట్స్ చేశారు. ఏపీ లో జనసేన బీజేపీ తో పొత్తు ఉన్నందున… బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కి జనసేన మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. అంతే కాదు ఈ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచారం చేయడం పై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. అయితే మొన్నటి వనకు పవన్ కళ్యాణ్ ఏపిలో తీసుకు వచ్చిన భూమ్ కి ఆ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బద్వేల్ బరిలో తాము నిలబడబోమని స్వయంగా తెలపడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇక బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక.. అక్టోబర్‌ 30 వ తేదీన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ, కాంగ్రెస్‌ మరియు బీజేపీలు మాత్రమే బరిలో ఉన్నాయి.