గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలో భలే రంజుగా సాగుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాన్ని మార్చివేయనుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో విజయం ఏకపక్షమేనని అర్థమవుతోంది. ఇటీవల బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. […]