ఇదేం ఫ్యాషన్ రా బాబూ.. పరుగులు పెట్టిన జనం!

సాధారణంగా మహిళలకు ఫ్యాషన్​ అంటే పిచ్చి.. ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు మార్కెట్ లోకి కొత్తగా వచ్చే దుస్తుల నుంచి హెయిర్ పిన్ను వరకు ప్రతీదీ ఫ్యాషన్ గా ఉన్నవాటినే ఎంచుకుంటారు. అంద‌రిలా కాకుండా కొత్త‌గా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవుతుంటారు. అయితే ఓ మహిళ అందరిలా తాను ఉంటే ప్రత్యేకత ఏముందీ అనుకుందో ఏమో కానీ.. కాస్త వెరైటీ ప్రదర్శించాలని ప్రయత్నించింది. అందుకే వినూత్నంగా తన జుట్టుకు హెయిర్ బ్యాండ్ చుట్టుకుంది.. అదేంటీ హెయిర్ బ్యాండ్ గురించి అంతగా చెప్పాల్సిన.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటా అనుకుంటున్నారా? ఆమె ధరించింది మామూలూ హెయిర్ బ్యాండ్ కాదు.. పామునే బ్యాండ్ గా చుట్టుకొని వచ్చింది.. ఏదో బొమ్మ పాము కాదండోయ్​.. నిజంగానే పాము.

banc minదూరం నుంచి చూసి భ‌లే బాగుందే అని ద‌గ్గ‌రికి వ‌చ్చి, కొప్పుపై ఉన్న‌ది బ్యాండ్ కాద‌ని నిజ‌మైన పాము అని గ్ర‌హించిన జనాలు అక్కడ నుంచి పరుగులు పెట్టారు. ఓ మహిళ షాపింగ్‌ చేయడానికి మాల్‌కు వెళ్లింది. ఆ సమయంలో మాల్‌ లో ఉన్న వారంతా ఆమె తల పై ఆసక్తిగా చూడటం గమనించారు. ఆమె జుట్టుకు విచిత్రమైన ఓ హెయిర్‌ బ్యాండ్‌ ఉండటమే.

అందరు అది నిజంగానే రబ్బరు బ్యాండ్ అనుకోని ఫోటోలు వీడియోలు తీయటం ప్రారంభించారు.. కానీ అది కదలటం మొదలెట్టగానే ఎక్కడి వారు అక్కడే పరరాయ్యారు. ‘ఇదెక్కడి ఫ్యాషన్ రా బాబు’ అంటూ కొంత మంది అనుకుంటే.. ‘కొంత మంది పాము కాటుకు చచ్చేవాళ్లం’ అని మరికొందరు అనుకొంటున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Snakes Mania (@snakes.mania)