బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు సాధారణంగా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని గొడవలకు దిగుతుంటారు
బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు సాధారణంగా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని గొడవలకు దిగుతుంటారు. మరీ దారుణంగా జుట్టు పట్టుకొని కొట్టుకోవడం, దారుణంగా దూషించడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే అలాంటి ఘటనే హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సులో చోటుచేసుకంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి నిర్మల్ కు ఆర్టీసీ బస్సు బయలు దేరింది. అది డిచ్ పల్లికి చేరుకోకాగనే అక్కడ.. ఇద్దరు మహిళలు ఎక్కారు. ఈ క్రమంలో ఓ సీటు విషయంలో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. చిన్న గొడవ కాస్త పెరిగి పెద్ద కొట్టుకునే స్థాయికి వెళ్లింది. సీటు నాది అంటే నాది అని ఇద్దరు మహిళలు దారుణంగా దూషించుకున్నారు. మరోవైపు ఇతర ప్రయాణికులు గొడవను పరిష్కరించేందుకు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. వదిలేయండి, గొడవ ఆపండి అని చెబుతున్నా.. వారు ఆపకపోవడం గమనార్హం.
వీరి గొడవను చూసిన వాళ్లు ఇది బస్సు అనుకుంటున్నారా? బోరింగ్ వద్ద నీటి పంచాయితీ అనుకుంటున్నారా ? అంటూ తోటి వారు అంటున్నారు. నువ్వు కూర్చున్న సీటు ఇరిగిపోను, నీ చీర చినిగి పోను అంటూ తిట్ల దండకం అందుకున్నారు. ఇంతలోనే వారి లోని ఓ మహిళ భర్త మధ్యలో మాటలు అందుకున్నాడు. దీంతో అపర కాళి అవతారం ఎత్తి సదరు వ్యక్తి చొక్కను చించేసింది. ఈ ఘటన చూసిన చాలా మంది మగవాళ్లే నయం రా బాబు.. సీటైనా, సిగరేటైనా సమానంగా పంచుకుని సోదర భావంతో ఉంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.