భారత్‌కు అమెరికా సీరియస్‌ వార్నింగ్‌

భారత్‌కు అనేక దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికాతో కూడా స్నేహపూర్వక వాతావరణం ఉంది. కానీ భారత్‌ చేస్తున్న ఒక పని మాత్రం అమెరికాకు నచ్చడం లేదు. ఆ విషయంలో భారత్‌ను హెచ్చరిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. రష్యా నుంచి భారత్‌ ఎస్‌400 క్షిపణులను కొనుగోలు చెయొద్దని వారిస్తున్నట్లు అమెరికా పేర్కొంది.

కాగా మన పక్క దేశం చైనాతో మనకు ఉన్న ఘర్షణ దృష్య్టా భారత్‌ రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. కాగా చైనాతో గొడవను తాము పరిగణంలోకి తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. అయినా కూడా రష్యా నుంచి ఎస్‌400 క్షిపణులు కొనుగోలు చెయొద్దని అంటుంది. మరి అమెరికా వారింపుపై భారత్‌ ఏ విధంగా స్పందిస్తోందో చూడాలి? మరి అమెరికా వార్నింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.