అమెరికా కంపెనీలను వేధిస్తున్న రాజీనామాలు! ఉద్యోగులు దొరక్క అవస్థ

అమెరికాలో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రెండు నెలలో ఏకంగా 87 లక్షలమంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పగా.. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఏకంగా 44 లక్షలమంది రాజీనామా చేశారు. ఈ లెక్కలను అమెరికా కార్మిక శాఖనే స్వయంగా వెల్లడించింది. కొత్త అవకాశాల కోసమే పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రస్తుత ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు సమాచారం.

US Job Resignation Peoples - Suman TVఎక్కువ ఆదాయం ఉన్న మార్గాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ రాజీనామాల పర్వంతో అమెరికాలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రిటైలర్లకు, డెలివరీ కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం ఉన్నప్పటికీ.. చేరేందుకు ఎవరు సిద్ధంగా లేరు. దీంతో ఇలాంటి కంపెనీలకు మ్యాన్‌పవర్‌ లభించక ఇబ్బంది ఎదురువుతోంది.