అర్ధ శాస్త్ర విభాగంలో ముగ్గురికి నోబెల్‌ ప్రైజ్‌

The three Nobel laureates are from that country - Suman TV

ముగ్గురుకి ఈ ఏడాదిగాను అర్ధ శాస్త్ర విభాగంలో నోబెల్‌ ప్రైజ్‌ను రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ సోమవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఆర్థిక వేత్తలు డేవిడ్‌ కార్ట్‌, జాషువా యాంగ్రిస్ట్‌, గైడో ఇంబెన్స్‌ అర్థ శాస్త్ర విభాగంలో చేసిన కృషికిగాను నోబెల్‌ బహుమతి వరించింది. ఎకానమీ పాలసీలతో, ఇతర ఆర్థిక విధానాలతో ఏర్పడే ప్రభావాలను సహజ ప్రయోగాలను ఉపయోగించి అర్థం చేసుకోవడానికి చేసిన కృషికి గాను వీరికి ఈ ఏడాది అర్ధశాస్త్రంలో నోబెల్‌ బహుమతి దక్కింది.

వీరు ఆవిష్కరించిన ‘సహజ ప్రయోగాలు’ వాస్తవ జీవిత పరిస్థితులను ప్రపంచంపై ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయాలను తెలుసుకోవచ్చును. 1990 ప్రారంభంలో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపుపై ఎకనామిస్ట్‌ డేవిడ్‌ కార్డ్‌ చేసిన ప్రయోగంతో ఉద్యోగాల పెరుగుదల ఉంటుందని నిరూపించారు. ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్‌ కార్డ్‌కు, మిగతా సగాన్ని జాషువా, గైడో పంచుకోనున్నారు.