గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మానవాళి మేలుకోవాల్సిన సమయం వచ్చింది.పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఇప్పుడొచ్చిందేమీ కాదు. అర్ధశతాబ్దం కిందటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 5, 1972న పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది ఇదే రోజున ఏదైనా ఓ నగరంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 1972 సవంత్సరం జూన్ 5న స్వీడన్‌లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు చేపట్టేలా ప్రోత్సహించడమే పర్యావరణ దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సినీనటుడు అల్లు అర్జున్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
తన ఇంటి వద్ద మొక్క నాటి అందరూ నాటాలని పిలుపునిచ్చాడు. తాను మొక్క నాటి నీళ్లు పోస్తుండగా తీసుకున్న ఫొటోను షేర్ చేసి, అందరూ మొక్కలు నాటి తనలాగే చేయాలని పిలుపునిచ్చాడు.మొక్కలను నాటుతామని, పర్యావరణ హిత అలవాట్లను స్వీకరిస్తామని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మన భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనానికి చిరునామాగా మార్చుదాం. ప్రతి ఒక్కరూ ఈ చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. మొక్కలు నాటి షేర్ చేయండి.. వాటిల్లో కొన్నింటిని నేను రీషేర్ చేస్తాను. భూమిని రక్షించుకునేందుకు మనందరం కలిసి పని చేద్దాం’ అని #GoGreenWithAA హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఈ ట్యాగ్ ని అభిమానులు అంతే ఉత్సాహంగా షేర్ చేసుకుంటున్నారు