విజయ్-దిల్ రాజు-వంశీ పైడిపల్లి.. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ

dil raju vijay

ఫిల్మ్ డెస్క్- తమిళ హీరో విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ 5 స్టార్స్ లో విజయ్ కూడా ఉన్నారు. ఒక్క తమిళంసోనే కాదు విజయ్ కు తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ తమిళ సినిమాలన్నీ తెలుగులో విడుదలవ్వడంతో పాటు, మంచి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో విజయ్ కి తెలుగులోను అభిమానులున్నారు. ఇక విజయ్ తో ఓ భారీ సినిమాను తీసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారట. ఈమేరకు విజయ్ తోను సంప్రదింపులు జరపడం కూడా అయిపోయిందని తెలుస్తోంది. ఇక దళపతి విజయ్ తో దిల్ రాజు తీయబోయే సినిమాకు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు.

vamshi

వంశీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి లాంటి బంపర్ హిట్ సినిమా తీశాక.. మళ్లీ ఏ సినిమా తీయలేదు. ఇటువంటి సమయంలో మంచి కధను తయారు చేసుకున్న వంశీ పైడిపల్లి, తమిళ హీరో విజయ్ ఐతే తన కధకు న్యాయం జరుగుతుందని భావించారట. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజుకు చెప్తే ఆయన వెంటనే విజయ్ మాట్లాడటం, దళపతి ఓకే చెప్పడం వెనువెంటనే జరిగిపోయాయని తెలుస్తోంది. ఇక విజయ్ తో తమ ప్రాజెక్టు గురించి స్వయంగా వంశీపైడిపల్లి చెప్పారు. నా కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్ట్ కోవిడ్ తగ్గిన తరువాత ప్రారంభం కాబోతోంది.. రాజుగారు నిర్మించే ఈ చిత్రంలో దళపతి విజయ్ నటిస్తారు.. ప్రస్తుతం కోవిడ్ సమయం కాబట్టి దీనిని ప్రకటించలేదు.. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.. అంతదాకా మిగిలిన సమాచారం అంతా సస్పెన్స్.. అని చెప్పారు వంశీ.

దీంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దళపతి 66వ సినిమా అంటూ ట్విట్టర్‌లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ కి ఏకంగా 90 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు దిల్ రాజు రెడీ అయ్యారని సమాచారం. అంతే కాదు ఈ భారీ ప్రాజెక్టును సుమారు 300 కోచ్ల రూపాయలతో చేయబోతున్నారన్న చర్చ ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది. మరి ముందు ముందు ఈ క్రేజీ ప్రాజెక్టు పై ఎటువంటి ఆసక్తికరమైన సమాచారం రాబోతోందోనని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.