అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా.. అఖిల్ తన తర్వాతి సినిమాను లైన్లో పెడుతున్నాడని తెలుస్తోంది.
అక్కినేని వారసుడు అఖిల్‌కు యూత్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నటన, డ్యాన్సులు, లుక్స్‌తో యూత్‌లో మంచి చ్రేజ్ సంపాదించాడీ అక్కినేని అబ్బాయి. అఖిల్ నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు.. చూసేయడానికి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే ఆయన నుంచి మాత్రం ఆ రేంజ్లో మూవీస్ రావడం లేదు. ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని మినహాయిస్తే ఇన్నేళ్ల కెరీర్లో అఖిల్‌కు సరైన హిట్ పడలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఒళ్లు హూనం చేసుకుని కష్టపడి నటించిన ‘ఏజెంట్‌కు’ మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ శుక్రవారం రిలీజైన ఈ మూవీలో అఖిల్ నటనకు మంచి మార్కులు పడ్డా.. ఓవరాల్‌గా సినిమా మీద మాత్రం మిశ్రమ స్పందనలు వచ్చాయి.
‘ఏజెంట్’ ఫలితం ఏంటనేది తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే. సోమవారం వచ్చే కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫ్యూచర్ ఏంటో తేలిపోతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే.. అఖిల్ తన తర్వాతి ప్రాజెక్టును ఎవరితో చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ అక్కినేని వారసుడి తర్వాతి మూవీని ఒక స్టార్ డైరెక్టర్ రూపొందించనున్నారని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. వంశీ పైడిపల్లి అని ఫిలిం సర్కిల్స్ సమాచారం. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుందని వినికిడి. ఒకవేళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే మాత్రం అంచనాలు భారీగా ఉంటాయని చెప్పొచ్చు. ఇటీవలే ‘వారసుడు’తో హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి.. ఒకవేళ అఖిల్‌ను డైరెక్ట్ చేస్తే తమ హీరోను ఏ స్థాయిలో చూపిస్తాడోనని ఊహించుకుంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.
Akhil Akkineni’s next film will be with Dir Vamshi Paidipally!
— Christopher Kanagaraj (@Chrissuccess) April 29, 2023