స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా ఆయన బొమ్మ గీసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ బొమ్మను వీడియో తీసి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా తోటి నటీ,నటులు వారికి శుభాకాంక్షలు చెప్పటం పరిపాటి. మంచి పరిచయాలు ఉన్నవారు నేరుగా వారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. అలా కుదరని పక్షంలో సోషల్ మీడియా వ్యాప్తంగా ఓ పోస్టు పెట్టి శుభాకాంక్షలు చెబుతుంటారు. ఎదుటి వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని బట్టి శుభాకాంక్షలు చెప్పే తీరు మారుతుంది. తాజాగా, తమిళ స్టార్ హీరో విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖ నటి సనమ్ శెట్టి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పింది. అదే ఆమెను ట్రోల్స్‌కు గురయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
నిన్న ఇళయ దళపతి విజయ్ పుట్టిన రోజున నటి సనమ్ శెట్టి కొత్తగా శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంది. ఇందుకోసం తన కళను బయటపెట్టింది. ఆయన తాజా చిత్రం లియోలోని గెటప్‌ను బొమ్మగా గీసింది. ఆ బొమ్మను ఫొటో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న విజయ్ ఫ్యాన్స్ సనమ్ శెట్టిపై ఫైర్ అవుతున్నారు. ‘‘ నువ్వు గీసిన ఆ బొమ్మ విజయ్‌తో ఒక్క పోలికైనా ఉందా.. చెత్తలా గీశావ్’’..
‘‘ ముందు ఆ చెత్తను డిలీట్ చేసేయ్’’.. ‘‘ నువ్వు బొమ్మలు వేయటం మానుకుంటే మంచిది. లేదంటే పరువుపోతుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, సనమ్ శెట్టి అంబులి అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. శ్రీమంతుడు సినిమాతో తెలుగు తెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సింగమ్ 124, ప్రేమికుడు అనే సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. మరి, స్టార్ హీరో బొమ్మ గీసి సనమ్ శెట్టి తిట్లు తినటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Small gift with big love to our lovable Thalapathy 🌟
Have a bloody sweet Birthday @actorvijay sir 🎂 #HBDThalapathy #Vijay #mynewsketch #samstrokes#LeoFirstLook #LeoSecondLook #ThalapathyBirthday pic.twitter.com/cu3cZKYP5Q— Sanam Shetty (@ungalsanam) June 22, 2023