ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ఈ ఒక్క కారణంతోనే చివరికి!

Telangana

ప్రేమ.. కులం, మతం, ప్రాంత బేధాలు ఏవీ అడ్డులేవంటూ ఇద్దరి మనసులను కలుపుతుంది. అలా వారి ప్రయాణంలో ఎన్నో తీపి గుర్తులు చెరిగిపోనిగా ఉంటాయి. కానీ అన్ని ప్రేమలు పెళ్లిళ్ల వరకూ వెళ్లవు. అలా కొందరి ప్రేమను అంగీకరించని తల్లిదండ్రుల నిర్ణయంతో అనేక మంది ప్రేమ జంటలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజాపేట మండలం బూర్గుపల్లికి గ్రామం. సాయితేజ, అఖిల ఇద్దరిది ఒకే గ్రామం. ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ ఉన్నాడు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో కొంత కాలం వీరిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని ప్రేమ పక్షుల్లా రెక్కలు కట్టుకుని విహరంలో తెలియాడారు. ఇదిలా ఉంటే గత నెల క్రితం వీరి ప్రేమ వ్యవహారం అఖిల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఇలా కాదని భావించిన తండ్రి అఖిలను తన బంధువులు ఇంట్లో కొన్నాళ్లు ఉంచాడు. దీంతో అప్పటి నుంచి సాయితేజ, అఖిల కలుసుకోవడానికి వీలు కాలేదు.

ఇది కూడా చదవండి: 1000 జంటల వికృత శృంగారం.. నీ భార్య నాకు, నా భార్య నీకంటూ!!

ఇక భరించలేకపోయిన ఈ ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అనుకున్నట్లుగానే సాయితేజ తన ప్రియురాలిని తీసుకుని తమ వ్యవసాయ పొలంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమికుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రేమజంట ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.