అన్యంపుణ్యం తెలియని బాలికల్ని, యువతులను వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చెన్నైలో ఈ ముఠా ఆగడాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు బాలికల్ని రక్షించారు. అసలు నిర్వాహకులు పరారీలో ఉన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్ ఈ దారుణానికి తెర లేపింది. ఆ రాష్ట్రం నుంచి ఉపాధి కల్పిస్తానంటూ నమ్మించి బాలికల్ని బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు తరలిస్తోంది. అలా త్రిపురకు చెందిన నలుగురు బాలికల్ని మొదట ఓ బ్యూటీ పార్లర్ లో పనికి పెట్టారు. కొన్నాళ్లు గడిచాక వారిని చెన్నై శివారులోని కేలంబాక్కం ప్రాంతానికి తరలించారు. అక్కడ అల్లావుద్దీన్, అన్వర్, హుస్సేన్, మైదీన్ అనే వ్యక్తులు వాళ్లను చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత వారిని రిసార్టులకు తరలించడం మొదలు పెట్టారు.
బలవంతంగా రిసార్డులలో వ్యభిచార కూపంలోకి దించారు. ఈనెల 26న రిసార్టుకు తరలిస్తుండగా ఓ బాలిక(16) వారి చెర నుంచి తప్పించుకుంది. ఆమె పెట్రోలింగ్ పోలీసులను ఆశ్రయించి.. వారి పరిస్థితిని వివరించింది. పోలీసులు వారి చెరలో ఉన్న మరో ముగ్గురు బాలికలను రక్షించారు. ఈ పాడుపనికి సంబంధించిన అసలు సూత్రధారులు ఆ మహిళ, నిర్వాహకులు తప్పించుకున్నారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. బాధిత బాలికలను తిరిగి త్రిపుర పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన స్థానికంగానే కాదు.. త్రిపురలోనూ కలకలం రేపింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘ఆ కామ పిశాచిని ఉరి తీయండి’