భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం.. తెల్లారేసరికి విషాదం

wife killed husband

నిండు కాలాల పాటు ఎంతో సంతోషంగా సాగాల్సిన భార్యాభర్తల జీవితాలు మధ్యలోనే అంతమవుతున్నాయి. ఈ అన్యోన్య జీవితాల అంతానికి ముఖ్యంగా వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. కానీ ఇదే కారణం చేత ఓ భర్త అమాయక భార్యను అతి కిరాతకంగా హత్య చేయటం స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పోలీసులు తెలిపన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లి గ్రామం. అల్వాల నర్సింహ్మ, లక్ష్మమ్మ(మంగమ్మ) ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 2005లో వివాహం జరిగింది.

అయితే భర్త పెళ్లైన కొన్నాళ్ల వరకు స్వంత గ్రామం చిప్పలపల్లిలో ఉన్నా కొన్నాళ్లకి అత్తగారి ఇల్లైన మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడెనికి మాకం మార్చారు. భర్త సిమెంట్ పని, డ్రిల్లింగ్ పని చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఓ రోజు భార్య ఫోన్ కు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో భార్యపై భర్తకు అనుమానం కలిగింది. నాకు తెలియకుండా పరాయి మగాడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందేమోనని అనుమానం బలపడింది.

ఇక ఈ క్రమంలోనే ఓ రోజు భర్త నరసింహ మద్యం తాగి భార్యతో ఇదే విషయంపై గొడవకు దిగాడు. ఈ వివాదం తెల్లారులు చినిగి చినిగి గాలి వానలా మారింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త క్షణికావేశంతో విద్యుత్ వైర్ తో భార్యను ఊరేసి చంపేశాడు. ఇక తెల్లారేసరికి భార్య విగత జీవిగా పడి ఉండడంతో కొత్త నాటకానికి తెర తీశాడు. నా భార్య ఆత్మహత్య చేసుకుందని ఊరంత నమ్మబలికాడు. ఇక అనుమానం వచ్చిన భార్య తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు ఎంటర్ కావడంతో భర్తను నిలదీసి అడిగారు. ఎట్టకేలకు నా భార్యను నేనే చంపానంటూ ఒప్పుకోవడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త నరసింహను అరెస్ట్ చేశారు.