పెద్దలను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. మంచాన పడ్డాడని ప్రియుడితో లేచిపోయింది..

Love Couples

ఈ రోజుల్లో ప్రేమ, పెళ్లి, పిల్లలు, తల్లిదండ్రులు, ఇలాంటి బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్‌ కంటే కూడా.. చాలా మంది అక్రమ సంబంధానికే మొగ్గు చూపుతున్నారు. 5 నిమిషాల సుఖానికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. కట్టుకున్న భార్య/భర్త కన్నా కూడా చీకటి బంధానికే చేతులు చాపుతున్నారు. చివరి శ్వాస వరకు నీతోనే ఉంటానంటూ పెళ్లినాటి ప్రమాణాలు చేసి.. నా సుఖం నాది అంటూ నట్టేట ముంచేస్తున్నారు. ఆ నీఛ బుద్ధుకి ప్రేమ అనే పవిత్ర బంధం కూడా అడ్డుగా నిలవలేకపోతోంది. ప్రేమించి పెళ్లాడిన భర్త/భార్యను కూడా మ్యాగీ చేసినంత ఈజీగా మోసం చేస్తున్నారు. అలాంటి ఓ ప్రబుద్ధురాలి గురించే ఈ వార్త.

వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఫైనాన్స్‌ కన్సల్టెన్సీ వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా.. పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకునే దాకా వెళ్లింది. వారికి ఓ పాప కూడా పుట్టింది. అప్పటి వరకు అంతా ఆనందంగా గడుస్తోంది. బావమరిది ఏదో వ్యాపారం చేస్తానంటూ ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరాడు. భార్య తమ్ముడేగా అని షూరిటీ ఇచ్చి మరీ.. రూ.48 లక్షలు అప్పు ఇప్పించాడు. ఆ అప్పే అతనికి జీవితానికి పెద్ద ముప్పు అయ్యింది.

Love Couples

తర్వాత బావమరిది వాయిదాలు చెల్లించడం మానేశాడు. షూరిటీ ఉన్నందుకు అప్పు ఇచ్చిన వారు బావను వేధించడం మొదలు పెట్టారు. మరోవైపు వ్యాపారంలో కూడా నష్టాలు మొదలయ్యాయి. ఆ అప్పు గురించి మనోవేదనకు లోనై.. మంచాన పడ్డాడు. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యాడు. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ గ్యాప్‌ లో మేడమ్‌ కు అక్రమ సంబంధం కూడా ఏర్పడింది. మంచంలో ఉన్న భర్తను కాదనుకుని.. బిడ్డతో సహా ప్రియుడితో లేచిపోయింది.

పెద్దలను కాదనుకుని వివాహం చేసుకున్నాడు కాబట్టి.. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు. ఎవరూ లేని ఏకాకిగా మారిన ఆ బాధితుడు.. స్పందన కార్యక్రమంలో తన ఆవేదను చెప్పుకున్నాడు. భార్యపై చర్యలు తీసుకుని తన కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా వేడుకున్నాడు. ఫిర్యాదు నమోదు చేసుకుని పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.