ప్రియుడితో కలిసి కొడుకు ఎదుటే భర్తపై తల్లి వీరంగం!

crime

ఈ మధ్యకాలంలొో భార్యాభర్తల అన్యోన్య జీవితాన్ని వివాహేతర సంబంధాలు నట్టేట్ట ముంచేస్తున్నాయి. వక్రమార్గంలోకి వెళ్లిన కొందరు భార్యాభర్తలు పచ్చని సంసారాల్లో అగ్గి రాజేసుకుని నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక కొంతమంది వివాహితలు ప్రియుని మోజులో పడి చివరికి అడ్డొచ్చిన భర్తను కూడా కడతేర్చేందుకు వెనకాడని ఘటనలు అనేక చూస్తున్నాం. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలో చెన్నుగారి పల్లెపరిధిలోని పాకాలలోని శివశక్తి నగర్ లో నవీన్ కుమార్ అనే వ్యక్తికి ఓ మహిళతో పెళ్లై ఓ కుమారుడు కూడా ఉన్నారు. కొంత కాలం వీరి దాంపత్య జీవితం ఆనందగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భార్య భర్తకు తెలియకుండా తెర వెనుక సంసారానికి పచ్చ జెండా ఊపింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో నవీన్ భార్య వివాహేతర సంబంధానికి ఒడిగట్టింది. ప్రియుని మెజులో పడి సొంత సంసారానికి తూట్లు పొడిచేంత పని చేసింది. ఈ మధ్యకాలంలో నవీన్ కు తన భార్య నడిపిస్తున్న తెర వెనుక సంసారం గురుంచి అతని చెవిన పడింది.

ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల నవీన్ కు తన భార్యకు ఏదో విషయంలో గొడవ రాజుకుంది. ఈ సమయంలోనే మెల్లగా తన భార్య ప్రియుడు ఏంట్రీ ఇచ్చాడు. ఇక భార్య తన కొడుకు ముందే ప్రియుడి సాయంతో భర్తపై దాడి చేయించింది. ఏకంగా తన భార్యే ఈ దాడికి పాల్పడడంతో భర్త తట్టుకోలేకపోయి ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ విషయం బయటకు పొక్కకుండా భార్య జాగ్రత్త పడడంతో అసలు విషయం ఎవరికి తెలియకపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇక అనంతరం కొడుకు పోలీసులకు ఇచ్చిన వాంగ్ములంతో పోలీసులతో సహా అందరూ బిత్తరపోయారు. మా అమ్మే ఓ అంకుల్ తో మా నాన్నపై దాడి చేయించిందని, దీనికి మనస్థాపానికి గురై మా నాన్న ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అసలు నిజాలు బయట పడతాయని తెలిపారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇలా ప్రియుని మోజులో పడి భర్తను కడతేర్చేందుకు ప్రయత్నాలు చేసిన ఈ భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.