వివాహేతర సంబంధాల్లో వేలు పెట్టిన తండ్రి.. దీంతో కొడుకు చేసిన పనికి అంతా షాక్!

illegal

వివాహేతర సంబంధాలే నేటి కాలంలో పచ్చటి జీవితాలను నాశనం చేస్తున్నాయి. కొందరు పెళ్లైన భార్యాభర్తలు తెరచాటున వివాహేతర సంబంధాల్లో తలుదూర్చుతూ నిండు కాపురాలను బజారుకు ఈడ్చుకుంటున్నారు. ఇలా అక్రమ సంబంధాల్లో వేలు పెట్టిన ఓ తండ్రికి కొడుకు తగిన గుణపాఠం చెప్పాడు. అసలు తండ్రికి ఏం గుణ పాఠం చెప్పాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ఆనంతపురం జిల్లాలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన నగేష్, లక్ష్మికి 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. దీంతో కుమారుడు, కూతురు జన్మించారు. దీంతో కొన్నాళ్ల తర్వాత భార్య మరణించటంతో మరో వివాహం చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు రావటంతో రెండో భార్య నగేష్ ని విడిచి వెళ్లిపోయింది. ఇక నగేష్ బోర్ వేల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తూ అలా కొన్నళ్ల పాటు జీవినాన్ని కొనసాగిస్తూ తన కూతురి వివాహాన్ని చేశాడు. దీంతో ఇంట్లో నగేష్, అతని కుమారుడు మాత్రమే ఉండేవారు.

దీంతో ఈ మధ్యకాలంలో నగేష్ గ్రామంలోని కొందరి మహిళలతో వివాహేతర సంబంధాల్లో తలదూర్చాడు. ఈ విషయం నగేష్ కుమారుడికి తెలియటంతో తండ్రిని పలుమార్లు మందలించే ప్రయత్నం చేశాడు. అయినా నగేష్ బుద్ది మాత్రం అస్సలు మారలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన కుమారుడు ఇనుపరాడ్డుతో తండ్రి తలపై బలంగ బాది ఘోరంగా హత్య చేశాడు. ఇక గ్రామంలోని ఎవరికి కూడా అనుమానం రాకుండా నీటి కాలువలో పడేసి తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించటంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.