రెస్టారెంట్‌లోని లేడీస్‌ టాయిలెట్‌లో సీక్రెట్ రికార్డింగ్.. తెలివిగా పట్టుకున్న యువతి

సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దారుణాలకి అంతే లేకుండా పోతోంది. మానవ మృగాలకి.. వారి వయసుతో సంబంధం ఉండటం లేదు. ప్లేస్ తో సంబంధం ఉండటం లేదు. ఎక్కడ పడితే అక్కడ.. నేటి సమాజంలో స్త్రీని కామం నిండిన కళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌ లో చోటు చేసుకుంది.

హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అంతా పెద్ద షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. రోడ్‌ నెంబర్‌ 10లో కూడా ఇలాంటి ఓ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఫుడ్ కోసం వెళ్లిన ఓ యువతి ఫ్రెష్ అవ్వడానికి లేడీస్‌ టాయిలెట్‌ కి వెళ్ళింది. ఆ సమయంలో తనని ఓ సీక్రెట్ కన్ను వెంటాడుతున్నట్టు ఆమెకి అనుమానం వచ్చింది. ఆ వాష్ రూమ్ అంతా పరీక్షగా చూసింది. అక్కడ మూలగా ఓ ఫోన్ వీడియో రికార్డింగ్ ఆన్ లో ఉండటం ఆమె గమనించి షాక్ అయ్యింది.

Jubillee Hills 1 Drive Reastaurent Toilet Romm Camera - Suman TVఆ ఫోన్ తీసుకుని వెళ్లి హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది యువతి. అదే సమయంలో పోలీసులకి కూడా సమాచారం అందించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు. బెనర్జీ ఆ హోటల్ లో హౌస్ కీపింగ్‌ బాయ్‌.

రెండు రోజుల క్రితమే బెనర్జీ ఈ ఫోన్ కొత్తగా కొన్నట్టు తెలుస్తోంది. ఫోన్ లో మొత్తం నాలుగన్నర గంటల ఫుటేజ్ ఉన్నట్టు సమాచారం. పదుల సంఖ్యల యువతుల వీడియోలు చిత్రీకరించినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో.., నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెస్టారెంట్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. మహిళల పట్ల ఇలా ప్రవర్తించే మృగాళ్ళకి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.