హైదరాబాద్ లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. హత్య!

దేశంలో ప్రతిరోజూ కామాంధులు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. కామంతో కళ్లు ముసుకుపోయి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఆ మద్య వరంగల్ లో తొమ్మిది నెలల పాపపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన హృదయాలను కలచి వేసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారికి వెంటనే ఉరిశిక్ష వేయకుండా కాలయాపణ చేయడంపై మహిళా సంఘలు, బాధిత కుటుంబాలు మండిపడుతున్నారు.

police minతాజాగా నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం, హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి విగత జీవిగా కనిపించడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా పొట్ట కూటికోసం హైదరాబాద్ కి వచ్చారు రాజు నాయక్ కుటుంబం. తాగుడు, దొంగతనాలకు అలవాడు పడ్డాడు రాజు. ఈ మద్యనే భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. ఇదిలా ఉంటే సాయంత్రం అయినా చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు అంతా వెతకడం ప్రారంభించారు. అయితే చిన్నారి కుటుంబ సభ్యులకు పక్కింటిలో ఉన్న రాజుపై అనుమానం వచ్చి అతని ఇంట్లోకి వెళ్లి చూశారు. చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారిపై అత్యాచారం చేసి నిందితుడు హత్య చేశాడు ఆ కామాంధుడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ దుర్మార్గుణ్ణి తమకు వెంటనే అప్ప చెప్పాలని.. డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు, స్థానికులు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వి, కారం చల్లారు. దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పండుగ పూట తమ చిన్నారి ఇలాంటి దారుణమైన పరిస్థితిలో చనిపోవడం చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.