తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఇద్దరినీ ఖమ్మం సబ్ జైలుకి తరలించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
తన కుటుంబం ఆత్మహత్యకు వనమా రాఘవేంద్ర కారణం అని రామకృష్ణ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆస్తి వివాదంలో సాయం చేయమని కోరితే.. వనమా రాఘవేంద్ర తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాక.. తన భార్యను పంపాల్సిందిగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. ఈ దారుణాలను భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తనతో పాటు భార్య బిడ్డలను కూడా తీసుకెళ్తున్నాని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. అయితే ఈ కేసులో రామకృష్ణ తల్లి, సోదరి వెర్షన్ మరోలా ఉంది. వనమా రాఘవేంద్ర చాలా మంచి వాడని వారు సర్టిఫికెట్ ఇచ్చారు. రామకృష్ణనే మంచి వ్యక్తి కాదని చెప్పారు. అసలు ఈ కేసులో వనమా రాఘవకు ఎలాంటి సంబంధం లేదని రామకృష్ణ తల్లి, సోదరి తెలిపారు.
ఇది కూడా చదవండి : రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో భారీ ట్విస్ట్!
వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా వారిద్దరూ చెప్పారు. ఎవరో కావాలనే రాఘవేంద్రను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు రామకృష్ణ బలాదూర్ గా తిరిగేవాడని, ఇప్పటికే చాలా అప్పులు చేశాడని అతడి తల్లి చెప్పింది. ఆస్తి విషయమై మాట్లాడేందుకే రామకృష్ణను వనమా రాఘవేంద్ర దగ్గరికి తీసుకెళ్లానని సత్యవతి చెబుతోంది. అసలు ఈ విషయంలో తనను రామకృష్ణ ఎందుకు ఇరికించాడో తెలియదని సోదరి మాధవి తెలిపింది. వనమా రాఘవేంద్రతో తమ కుటుంబానికి ఎలాంటి గొడవలు లేవన్నారు. ఇక రామకృష్ణ తన సూసైడ్ సెల్ఫీ వీడియోలో.. రాఘవతో పాటు తల్లి, సోదరిలపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : పాల్వంచ ఫ్యామిలీ సూసైడ్ కేసు నిందితుడు వనమా రాఘవ అరెస్ట్