అందమైన భార్య, చక్కటి పిల్లలు, సాఫీగా సాగిపోయే జీవితంలో అనుమానం పెనుభూతంగా మారుతోంది. చిన్న అపార్థాలే పచ్చని సంసారాల్లో చిచ్చును రాజేస్తున్నాయి. చివరకు అవి తారా స్థాయికి చేరి.. విచక్షణ మరచి ఊహించని దారుణాలకు చేరుతున్నాయి. తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఇద్దరినీ ఖమ్మం సబ్ జైలుకి తరలించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన కుటుంబం ఆత్మహత్యకు వనమా […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీకై దంపతులు సహా కుమార్తె సజీవదహనం అయ్యారు. మరో కుమార్తె 80 శాతం కాలిన గాయాలతో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు మంటలను ఆర్పేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. పాత పాల్వంచ తూర్పు బజారులో ఈ ఘటన జరిగింది. రామకృష్ణ- శ్రీలక్ష్మి దంపతులకు కవలలు. పాల్వంచలో నివాసముంటున్నారు. అతనికి అక్కడే ఒక మీ సేవా […]
వివాహేతర బంధాలు జీవితాలను చిదిమేస్తున్నాయి. కాపురాలను నాశనం చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడు ఇలాటి ఘటనే చోటు చేసుకుంది. 6 వ బెటాలియన్ కి చెందిన రాజేశ్ ఇక్కడే హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక రాజేశ్ కి 10 ఏళ్ళ క్రితం స్వప్న అనే మహిళతో వివాహం అయ్యింది. అయితే.., ఈ మధ్య కాలంలో రాజేశ్ బుద్ధి దారి మళ్లింది. తాను ఇంకో పెళ్లి చేసుకుంటానంటూ.. భార్యని వేధించడం […]
మూడు ముళ్ళు, ఏడు అడుగులు, వేద మంత్రాలు, ఓ అరుంధతి నక్షత్రం.. ఓ తతంగంలా చూస్తే పెళ్లంటే ఇదే. కానీ.., ఒక్కసారి ఈ తంతు పూర్తయితే.. ఆ రెండు తనువులుమాత్రమే కాదు, హృదయాలు కూడా ఒక్కటైనట్టే. కానీ.., ఓ ప్రబుద్దుడు మాత్రం ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయిని శోభనం అవ్వగానే వదిలేశాడు. నాకు నా భార్య వద్దు అంటూ పోలీస్ స్టేషన్ లోనే పట్టుబట్టి కూర్చున్నాడు. గుండెని బరువు ఎక్కించే ఈ ఘటన ఇల్లెందులో చోటు చేసుకుంది. […]