కోరిక తీరిస్తే మార్కులేస్తా…టీచర్ వేధింపులు!..

A Lecturer sexually Harassing the Girl Student - Suman TV

పాఠశాల్లో అమ్మాయిలకు భద్రత కరువైంది. చదువు చెప్పాల్సిన టీచర్లు రాక్షసులుగా మారిపోతున్నారు. ‘కోరిక తీరిస్తేనే మంచి మార్కులు వేస్తా దానికంటే ముందుగా నగ్న వీడియో తీసి వాట్సాప్‌లో పంపించంటూ  విద్యార్థినికి ఓ కామాంధ అధ్యాపకుడు పెట్టిన షరతులు విని అంతా అవాక్కవుతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట విద్యార్థిని ఫోన్‌ నెంబర్‌ తీసుకుని, ఆ కీచక టీచర్ వికృతంగా ప్రవర్తించాడు. ఈ   వికృత చేష్టలను భరించలేలని ఆ విద్యార్థిని  ఉపాధ్యాయుడి గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది.

imgpsh fullsize anim 3 3సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న సెయింట్‌ ఆంథొనీస్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న నిందితుడు వినయ్‌ రాజ్‌, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినితో వాట్సాప్‌లో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు తరచూ అశ్లీల సందేశాలు పంపుతూ లైంగిక వేధింపులకు ఒడిగట్టాడు. నగ్న వీడియోలు పంపాలని, తన గదికి వచ్చి కోరిక తీర్చాలని వేధించాడు. అలా చేస్తేనే ఎక్కువ మార్కులు వేస్తానని, లేదంటే ఫెయిల్‌ చేస్తానని బెదిరించాడు.

అతడి ఆగడాలను భరించలేక బాధితురాలు తల్లిదండ్రులతో చెప్పడంతో, వారు కళాశాల దృష్టికి తీసుకు వెళ్లారు.  అతడు ఒంగోలులో ఉంటున్నాడని, ఆ వేధింపులతో తమకు సంబంధం లేదని కళాశాల ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు సంగారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి, వినయ్‌ రాజ్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

సభ్య సమాజం తలదించుకునే సంఘటనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా, మహిళా సంఘాలు పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.