కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కొజ్జిలి పేట ప్రాంతం. జూపూడి వెంకటేశ్వరరావు అనే వ్యాపారి పప్పు ధాన్యాల వ్యాపారం నడిపిస్తున్నాడు. లాభాలతో కొన్నాళ్ల పాటు బాగానే నడిచింది. దీంతో వ్యాపారి కుటుంబం కూడా సంతోషమైన జీవితాన్ని గడుపుతోంది. తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించి భార్యా పిల్లలతో వారి కాపురం సంతోషంగా సాగింది.
అయితే ఉన్నట్టుండి వ్యాపారంలో చిన్నపాటి నష్టాలు వచ్చాయి. అప్పులు తెచ్చి వ్యాపారాన్ని మళ్లీ ముందుకు నడిపాడు. అయినా నష్టాలు ఎక్కువై, తీర్చలేని అప్పులు భారమయ్యాయి. వ్యాపారంలో దాదాపుగా కోటికి పైగా నష్టాలు వచ్చాయి. ఇచ్చిన అప్పులు తిరిగివ్వాలంటూ రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. ఇక కుటుంబం అంతా గ్రామాన్ని, ఇల్లును వదిలి దూరంగా వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: సంసారానికి పనికిరాని భర్త.. క్రిష్ణా నదిలో భార్య దీక్ష!ఈ నెల 8న తేదీన విజయవాడ వచ్చి బస్‌స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జీలో ఒక గది అద్దెకు తీసుకున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక మనస్తాపం చెందిన ఆ నలుగురూ చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుమందు తాగారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మేము చనిపోతున్నామని, తమ గురించి ఎవరూ వెతకవద్దని, తమను ఎవరూ కాపాడొద్దని తమ బంధువులకు వెంకటేశ్వరరావు కూతురు మెసేజ్ చేసింది.
ఆ మెసేజ్ చూసిన వారి బంధువు వెంటనే లాడ్జీ నిర్వహకులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన సిబ్బంది రూమ్ లో పడి ఉన్న నలుగురు కుటుంబ సభ్యులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు మినహా వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన వారి స్వగ్రామంలో విషాదంగా మారింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.