యువకుడి ప్రేమలో పెళ్లైన ఆంటీ. భర్త లేని ఆ రాత్రి.. ఇంటి పక్కనే

love affair

కేరళ రాష్ట్రంలోని ఓ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన ఓ వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొల్లాం జిల్లాలోని సవిత, సతీష్‌ ఇద్దరూ భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ల పాటు భార్యతో పాటు ఉన్నభర్త ఉద్యోగ నిమిత్తం దుబాయికి వెళ్లాడు. ఇక ఇక్కడే కథ అడ్డం తిరిగింది. స్థానికంగా ఉండే మానప్పల్లిలోని సూపర్‌మార్కెట్‌లో సవిత పని చేస్తుంది. ఇక ఇదే సూపర్‌మార్కెట్‌లో సవితకు ప్రవీణ్ అనే వ్యక్తితో కాస్త పరిచయం ఏర్పడింది. దీంతో ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధం వరకూ వెళ్లింది. అలా ఇద్దరూ ప్రేమలో బాగా మునిగితేలారు. బయట కలుసుకోవటం, జాలిగా తిరగటం వంటివి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి ప్రియుడు ప్రవీణ్ కాల్ చేసి అర్జెంట్ గా కాలవాలంటూ కబురు పంపాడు. దీంతో పరుగు పరుగున వెళ్లిన సవిత.. ఇంటికి పక్కనే ప్రియుడు ప్రవీణ్ తో మాటలు పెట్టింది. ఇక ప్రియుడితో పాటు చాలా సేపు మాట్లాడుతున్న క్రమంలో భర్త సతీష్ సోదరి కూతురు వీళ్ళని చూసింది.

దీంతో వెంటనే ప్రియుడిని వదలిపెట్టి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇది గమనించిన ప్రియుడు తలుపులు తీసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ఎంతకు తెరుచుకోకపోవటంతో పగలగొట్టి చూస్తే ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని సవిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఇది గమనించిన ప్రియుడు ప్రవీణ్ భయంతో కనిపించకుండా పారిపోయాడు. ఇక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.