2007లో బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో శ్రీనివాసరావును కరీంనగర్ పోలీసులు రిమాండ్‌కు పంపగా, ఏడాదిపాటు కరీంనగర్ జైళ్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాంమార్చాడు. కూర శశాంకరావు పేరుతో చెలా మణి అవుతూ నకిలీ ఆధార్, పాన్ కార్డులతో తరచూ చిరునామా మారుస్తూ మూడేళ్లు గడిపాడు. వరంగల్‌లో కొంతకాలం మారుపేరుతోనే ఇంజనీ రింగ్ కళాశాలల్లో పనిచేశాడు. తదుపరి కుటుంబం లో వివాదాలు తలెత్తడంతో భార్య అతడిని విడిచి పెట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని విజయవాడకు మకాం మార్చాడు. అక్కడ కొంత కాలం, తిరుపతిలో కొంతకాలం హోటళ్లలో పనిచేశాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగిపోయింది. అప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులతో జీవితం దుర్భరంగా మారింది.
అలిపిరి మెట్ల మీద భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కుటుంబంతో సం బంధాలు కోల్పోయిన శ్రీనివాస్‌రావు కనిపించడం లేదని బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచే స్తున్న అతని తమ్ముడు శ్రీధర్ 2018లో వరంగల్‌లో ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజులకు తిరుపతిలో భిక్షా టన చేస్తున్న శ్రీనివాసరావును నిజామాబాద్ నుంచి వచ్చిన కొందరు గమనించి సమాచారాన్ని అతని సోదరుడు శ్రీధర్‌కు అందించారు. అతను తన అన్నను బెంగుళూర్ తీసుకెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించాడు. కరీంనగర్ పోలీసులు ‘ఆపరేషన్ తలాష్’లో భాగంగా శ్రీనివాసరావు ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ రావును గాలించేందుకు టౌన్ అడిషనల్ డీసీపీ పి.అశోక్ పర్యవేక్షణలో ఏఎస్‌ఐ సుజాత, కానిస్టేబుల్ కృష్ణ, రమేశ్, సంపత్‌తో ఓ బృం దాన్ని ఏర్పాటు చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్‌చార్జి మురళితో కూడిన బృందం 2 రోజులు బెంగళూర్‌లో గాలించి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కరీంనగర్‌కు తరలించారు. గతంలోని వారెంట్లతోపాటు నకిలీ పాన్‌కార్డు, ఆధార్ కార్డులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందం సభ్యులను సీపీ అభినందించి రివార్డులు అందించారు.