నడిరోడ్డుపై అర్ధనగ్నంగా మహిళ మృతదేహం.. సీసీ ఫుటేజ్ లో సంచలన దృశ్యాలు..!

Half naked woman thrown from moving vehicle at Coimbatore - Suman TV

తమిళనాడులో రాష్ట్రంలోని తాజాగా నడి రోడ్డుపై కనిపించిన దృశ్యాలతో స్థానికంగా సంచలనంగా మారింది. ఓ గుర్తు తెలియని మహిళ అర్దనగ్న శవం నడి రోడ్డుపై దర్శనమిచ్చింది. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనాలు ఆ మృతదేహాన్ని తోసుకుంటూ వెళ్లటంతో అంతా చిత్తు చిత్తుగా మారింది. ఈ సమాచారం పోలీసులకు వరకు వెళ్లటంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

Half naked woman thrown from moving vehicle at Coimbatore - Suman TVఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు చిన్నియంపళాయంలోని అవినాషి రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. ఒక ఎస్‌యూవీలో నుంచి సదరు మహిళ శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేసినట్లు షాకింగ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ మహిళను ఎవరు పడేశారు? హత్యచేసి రోడ్డుపై పడేశారా? లేక రోడ్డుపై పడేసిన తర్వాతే ఆ మహిళ మరణించిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇక ఆ శవాన్ని పోస్టు మార్టం నుంచి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఎవరో కావాలనే హత్య చేసి పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.