మూడు రోజుల పసికందు కిడ్నాప్. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్స్ ను పట్టుకున్న ఏపీ పోలీసులు!

Guntur Baby Kidnap - Suman TV

మాతృత్వం ఓ మధురానుభూతి. అయితే.., తన కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డ.. తనివి తీరా చూసుకోకముందే కిడ్నాప్ కి గురైతే? ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. పెద కాకానికి చెందిన ప్రియాంక అనే తల్లికి కూడా ఇలాంటి కష్టమే వచ్చింది. పక్కలోని బిడ్డని దుండగులు పట్టుకెళ్లి పోతే, ప్రియాంక తన బిడ్డ కోసం రోదనలు పెట్టింది. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే ఆ తల్లి కష్టం తీర్చారు. ఇంతకీ అసలు గుంటూరులో ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ ఎలా జరిగింది? ఎవరు చేశారు? గంటల వ్యవధిలోనే కిడ్నాపర్స్ ని ఎలా పట్టుకున్నారు? సినిమా ట్విస్ట్ లను మించిన ఈ ఘటన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పెద కాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ 12వ తేదీన జీజీహెచ్‌లో పండింటి మగ శిశువుని ప్రసవించింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వేళ 1.30 సమయంలో బాబుని తీసుకుని నాయనమ్మ, అమ్మమ్మ వార్డ్ బయటకు వచ్చారు. అనంతరం వారు బాలుడుని పక్కన ఉంచుకుని నిద్రపోయారు. అయితే.., ఊహించని విధంగా అర్ధరాత్రి నిందితులు బాబు ఎత్తుకెళ్ళిపోయారు.

Guntur Baby Kidnap - Suman TVనిద్రలో నుండి మేలుకున్న అమ్మమ్మ, నాయనమ్మకి పక్కలో మనవడు కనిపించలేదు. ఆస్పత్రి సిబ్బందిని ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో.. పోలీసులకి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా.. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలించి గంటల్లోనే వారిని పట్టుకున్నారు.నిందితులు హేమవర్ణుడు, అదే ఆసుపత్రిలో వార్డ్ బాయ్‌ గా పని చేస్తున్నాడు. అతని లవర్ పద్మ. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి డబ్బు కోసమే బాలుడిని ఎత్తుకెళ్లారని ప్రాధమిక సమాచారం. ఏదేమైనా తల్లి నుండి దూరమైన బిడ్డని గంటల వ్యవధిలోనే పట్టుకున్న ఏపీ పోలీసులపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.